భీకరమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ వన్డే వరల్డ్ కప్-2023లో మరింత చెలరేగి ఆడతాడని అంతా అనుకున్నారు. కొందరు వెటరన్ క్రికెటర్లయితే ఈసారి ప్రపంచ కప్‌లో గిల్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలుస్తాడని అంచనా వేశారు. అయితే బ్యాడ్ లక్. డెంగ్యూ బారిన పడిన ఈ యంగ్ బ్యాటర్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని న్యూస్ రావడంతో మొత్తం వరల్డ్ కప్‌కు దూరమవుతాడని ఫ్యాన్స్ భయపడ్డారు. ఈ టైమ్‌లో గిల్ ఆరోగ్యంపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కీలక అప్డేట్ ఇచ్చాడు.
గిల్ వేగంగా కోలుకుంటున్నాడని విక్రమ్ రాథోడ్ తెలిపాడు. అతడు హాస్పిటల్లో చేరిన మాట వాస్తవమేనని.. అయితే ముందు జాగ్రత్తగా ఇలా చేశామన్నాడు. ఎప్పటికప్పుడు డాక్టర్లు అతడ్ని పర్యవేక్షిస్తున్నారని.. త్వరలో అతడు గ్రౌండ్లోకి తిరిగి అడుగుపెడతాడని ఆశిస్తున్నామని విక్రమ్ రాథోడ్ చెప్పాడు. గిల్ ఇప్పటికే 70 నుంచి 80 శాతం రికవర్ అయ్యాడని.. అయితే అతడు ఏ మ్యాచ్‌లో ఆడతాడనేది ఇప్పుడే చెప్పడం కష్టమని పేర్కొన్నాడు. గిల్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన విక్రమ్ రాథోడ్.. ఈ సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ యూనిట్ మీదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
గిల్ లేకపోయినా భారత బ్యాటింగ్ యూనిట్ బలంగా, పటిష్టంగా ఉందన్నాడు విక్రమ్ రాథోడ్. ఎక్స్పీరియన్స్ కలిగిన బ్యాటర్లు టీమ్‌లో ఉన్నారని.. ప్రతి ఒక్కరికీ తమ రోల్ ఏంటో చాలా బాగా తెలుసన్నాడు. గ్రౌండ్లోకి దిగిన తర్వాత ఎలా ఆడాలనే స్వేచ్ఛ వాళ్లకు ఇచ్చామని స్పష్టం చేశాడు. ఏ ఒక్కరి మీదో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఆధారపడదని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు. భారత బ్యాటింగ్ కోచ్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే డెంగ్యూ వల్ల బలహీనంగా మారిన గిల్‌ను అప్పుడే బరిలోకి దించుతారా? ఇంకా కొన్ని మ్యాచులు రెస్ట్ ఇస్తారా? అనేది చూడాలి.
ఇదీ చదవండి: CWC 2023: అది విరాట్ అంటే.. బుమ్రా కోసం కోహ్లీ చేసిన పని వైరల్!
🚨 REPORTS 🚨
Shubman Gill is all set to fly to Ahmedabad from Chennai today. He will continue with his recovery there, under the observation of BCCI’s medical team.#CWC23 #CricketTwitter pic.twitter.com/xiR1vB3ClE
— Sportskeeda (@Sportskeeda) October 11, 2023