iDreamPost
android-app
ios-app

విండీస్ ‘బాహుబలి’ని చూసి డ్యాన్స్ చేసిన గిల్! వైరల్ వీడియో

  • Published Jul 13, 2023 | 8:31 AM Updated Updated Jul 13, 2023 | 8:31 AM
  • Published Jul 13, 2023 | 8:31 AMUpdated Jul 13, 2023 | 8:31 AM
విండీస్ ‘బాహుబలి’ని చూసి డ్యాన్స్ చేసిన గిల్! వైరల్ వీడియో

భారత్-వెస్టిండీస్ మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, టీమిండియా స్పిన్ మ్యాజిక్ ముందు నిలువలేకపోయింది. వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ బంతిని గింగిరాలు తిప్పుతుంటే.. విండీస్ బ్యాటర్లు కళ్లు తేలేశారు. కేవలం 150 పరుగులకే చాపచుట్టేసింది వెస్టిండీస్ జట్టు. అయితే.. విండీస్ బ్యాటింగ్ చివర్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

క్రికెట్‌లో హల్క్ మ్యాన్, బాహుబలిగా పేరున్న వెస్టిండీస్ బ్యాటర్ రహ్కీమ్ కార్న్‌వాల్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. 148 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజ్‌లోకి కొత్త వెస్టిండీస్ బ్యాటర్ వచ్చాడు. అప్పటికే క్రీజ్‌లో నిలదొక్కుకున్న కార్న్‌వాల్.. కొత్త బ్యాటర్‌తో మాట్లాడి.. బ్యాటింగ్ చేసేందుకు వెళ్తున్న సమయంలో గిల్.. డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాహుబలి ముందు గిల్ కుప్పిగంతులు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌట్ అయినా.. బాహుబలి కార్న్‌వాల్ మాత్రం తన వికెట్‌ను టీమిండియా బౌలర్లకు ఇవ్వలేదు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక విండీస్ ఆలౌట్ అయిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జైస్వాల్ తన తొలి మ్యాచ్‌లో ఫోర్‌తో పరుగుల కౌంట్‌ను మొదలుపెట్టాడు. ఈ జూనియర్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ తోడుగా ఉండటంతో మరింత చెలరేగి ఆడాడు.

40 పరగులతో జైస్వాల్, 30 పరుగులతో రోహిత్ శర్మ తొలి రోజు నాటౌట్‌గా నిలిచారు. ఇక రెండో రోజు సైతం వీరిద్దరూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే.. టీమిండియా విజయాన్ని ఎవరూ ఆపలేరు. మొత్తానికి తొలి రోజు అశ్విన్ 5, జడేజా 3, సిరాజ్, శార్దుల్ చెరో వికెట్ తీసుకుని విండీస్‌ను 150 రన్స్‌కే ఆలౌట్ చేశారు. రోహిత్, జైస్వాల్ వికెట్ పడకుండా 80 పరుగులు చేశారు. మొత్తానికి తొలి రోజు ఆటలో టీమిండియా పూర్తి పైచేయి సాధించింది. అయితే.. బాహుబలిని చూస్తూ గిల్ చేసిన డ్యాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తండ్రి కొడుకులను అవుట్ చేసిన అశ్విన్

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom