iDreamPost
android-app
ios-app

సచిన్‌ కూతురు సారాతో రెస్టారెంట్‌కి వెళ్లిన గిల్‌! బయటికొచ్చిన వీడియో

  • Author Soma Sekhar Published - 04:37 PM, Wed - 1 November 23

తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అయిన సారా టెండుల్కర్ తో కలిసి ఓ హోటల్ నుంచి బయటకి వస్తూ కెమెరా కంటికి చిక్కాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్. దీంతో మరోసారి వీరి డేటింగ్ వార్త వైరల్ గా మారింది.

తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అయిన సారా టెండుల్కర్ తో కలిసి ఓ హోటల్ నుంచి బయటకి వస్తూ కెమెరా కంటికి చిక్కాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్. దీంతో మరోసారి వీరి డేటింగ్ వార్త వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 04:37 PM, Wed - 1 November 23
సచిన్‌ కూతురు సారాతో రెస్టారెంట్‌కి వెళ్లిన గిల్‌! బయటికొచ్చిన వీడియో

శుబ్ మన్ గిల్-సారా టెండుల్కర్.. క్రికెట్ గురించి కాస్తో, కూస్తో తెలిసిన వారికి వీరిద్దరి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే గిల్-సారా జోడీ డేటింగ్ లో ఉన్నారని గతంలో చాలా వార్తలే వచ్చాయి. అయితే ఆ మధ్యలో వీరిద్దరు విడిపోయారని, ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో కూడా చేసుకున్నారన్న వార్తలు కూడా మనం చాలానే విన్నాం. సారా టెండుల్కర్ తో విడిపోయిన తర్వాత గిల్ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ తో ప్రేమలో ఉన్నాడని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ విషయాలన్నింటిపై ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వకపోగా.. కనీసం స్పందించలేదు. తాజాగా మరోసారి సారా టెండుల్కర్-శుబ్ మన్ గిల్ జంటగా కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్-సారా టెండుల్కర్ జోడీ మరోసారి కెమెరా కంటికి చిక్కారు. గత కొన్ని నెలల నుంచి వీరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గిల్ ఎక్కడ కనిపించినా.. సారా, సారా అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ.. గిల్ ను ఆటపట్టిస్తుంటారు. ఇదిలా ఉండగా.. తాజాగా తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అయిన సారాతో కలిసి కనిపించాడు గిల్. జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్ లో వీరిద్దరు కలిసి కనిపించారు. హోటల్ నుంచి వస్తూ.. సారా తన కామన్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఎంట్రన్స్ దగ్గరే ఆగిపోగా.. గిల్ ముందుగా వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీరు విడిపోలేదని, డేటింగ్ లోనే ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లుంది అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరిద్దరు మరోసారి ఇలా జోడీగా కనిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş