iDreamPost
android-app
ios-app

Shreyas Iyer: టీమ్‌ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌ ఔట్‌? అతని ప్లేస్‌లో..

  • Published Feb 07, 2024 | 2:28 PM Updated Updated Feb 07, 2024 | 2:28 PM

ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత సెలెక్టర్లు టీమ్‌ను ప్రకటించాల్సి ఉంది. ఆ టీమ్‌లో స్టార్‌ ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. మరి అతని స్థానంలో ఎవర్ని ఎంపిక చేయబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత సెలెక్టర్లు టీమ్‌ను ప్రకటించాల్సి ఉంది. ఆ టీమ్‌లో స్టార్‌ ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. మరి అతని స్థానంలో ఎవర్ని ఎంపిక చేయబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 07, 2024 | 2:28 PMUpdated Feb 07, 2024 | 2:28 PM
Shreyas Iyer: టీమ్‌ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌ ఔట్‌? అతని ప్లేస్‌లో..

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్‌ మధ్య మరో మూడు టెస్టులు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్‌ గెలిచి.. ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచిన విషయం తెలిసిందే. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో సత్తా చాటి.. సిరీస్‌ కైవసం చేసుకోవాలని రెండు టీమ్స్‌ గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే.. చివరి మూడు టెస్టుల కోసం భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించాల్సి ఉంది. నేడో రేపో.. స్వ్కౌడ్‌ను ప్రకటించనున్నారు. ఈ టీమ్‌లో తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన శ్రేయస్‌ అయ్యర్‌పై వేటు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్న అయ్యర్‌.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లోనూ సత్తా చాటాడు. కానీ, టెస్టుల్లో మాత్రం అయ్యర​ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన తొలి రెండు టెస్టుల్లో అయ్యర్‌ చేసిన స్కోర్లు చూస్తూ.. 27, 29, 35, 13 నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్కటంటే ఒక్క హాఫ్‌ సెంచరీ లేదు. అంతకు ముందు ఆడిన టెస్టుల్లోనూ అయ్యర్‌ విఫలం అవుతూనే ఉన్నాడు. అతని బ్యాడ్‌ ఫామ్‌ దృష్ట్యా ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు అతన్ని దూరం పెట్టే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు క్రికెట్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. క్రికెట్‌ నిపుణులు సైతం.. అయ్యర్‌ను పక్కనపెట్టడమే కరెక్ట్‌ అని అభిప్రాయపడుతున్నారు. మరి అయ్యర్‌ను పక్కనపెడితే.. అతని స్థానంలో ఎవర్ని ఎంపిక చేస్తారనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది.

వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్‌ కోహ్లీ, గాయంతో రెండో టెస్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌.. మూడో టెస్టుతో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్లిద్దరూ జట్టులోకి తిరిగొచ్చినా.. అయ్యర్‌ స్థానంలో.. యువ క్రికెటర్లు రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లను కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవాళి క్రికెట్‌లో అదరగొడుతున్న పాటిదార్‌, సర్ఫరాజ్‌ను.. కోహ్లీ, రాహుల్‌ల గైర్హాజరీతో జట్టులోకి తీసుకున్నారు. పాటిదార్‌ను రెండో టెస్టులో ఆడించారు కూడా. కోహ్లీ, రాహుల్‌ తిరిగొచ్చినా.. అయ్యర్‌, భరత్‌ లాంటి వాళ్లను పక్కనపెట్టి.. ఈ కుర్రాళ్లకు వారి స్థానాల్లో కొనసాగించే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.