దులీప్‌ ట్రోఫీలో దుమ్మురేపిన శ్రేయస్‌ అయ్యర్‌! టీ20 స్టైల్లో..

Shreyas Iyer, Anantapur, Duleep Trophy 2024: దులీప్‌ ట్రోఫీలో టీ20 స్టైల్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు శ్రేయస్‌ అయ్యర్‌. అతని థండర్‌ ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Shreyas Iyer, Anantapur, Duleep Trophy 2024: దులీప్‌ ట్రోఫీలో టీ20 స్టైల్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు శ్రేయస్‌ అయ్యర్‌. అతని థండర్‌ ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దులీప్‌ ట్రోఫీలో చెలరేగిపోయాడు.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపర్చిన అయ్యర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అది కూడా టీ20 స్టైల్లో ఆడాడు. కేవలం 39 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి.. సాలిడ్‌ బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. దులీప్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా-డీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు.

39 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్‌.. మొత్తంగా 44 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 54 పరుగులు చేసి అదరగొట్టాడు. వన్డేల్లో బాగా ఆడుతున్న అయ్యర్‌ టీ20ల్లో మాత్రం విఫలం అవుతున్నాడు. కానీ, ఈ టోర్నీలో మాత్రం టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేయడంతో అందరూ షాక్‌కి గురవుతున్నారు. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో అయ్యర్‌ చోటు ఆశిస్తున్నాడు. ఇప్పుడు ఆడిన ఇన్నింగ్స్‌తో అతనికి కాస్త రూట్‌ క్లియర్‌ అయినట్లు కనిపిస్తోంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా డీ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్‌ అయింది. అక్షర్ పటేల్‌ ఒక్కడే 86 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. ఇండియా-సీ బౌలర్లలో విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ 3, అన్షుల్‌ కంబోజ్‌, హిమాన్షు చౌహాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. మానవ్‌, హిృతిక్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. తర్వాత.. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇండియా-సీ టీమ్‌ 168 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇంద్రజిత్‌ 72, అభిషేక్‌ పొరెల్‌ 34 రన్స్‌ చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇండియా-డీ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ 54, దేవదత్‌ పడిక్కల్‌ 56, రికీ భుయ్ 44 పరుగులతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో అయ్యర్‌ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments