SNP
వరల్డ్ కప్‌లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా.. తమ పవర్ ఏంటో చూపిస్తుంది. పాపం.. పసికూన నెదర్లాండ్స్‌పై పంచా విసురుతోంది. బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటున్నారు. రోహిత్, కోహ్లీ, గిల్, అయ్యర్, కేఎల్ రాహుల్.. పండగ చేసుకుంటున్నారు.
వరల్డ్ కప్‌లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా.. తమ పవర్ ఏంటో చూపిస్తుంది. పాపం.. పసికూన నెదర్లాండ్స్‌పై పంచా విసురుతోంది. బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటున్నారు. రోహిత్, కోహ్లీ, గిల్, అయ్యర్, కేఎల్ రాహుల్.. పండగ చేసుకుంటున్నారు.
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పసికూన నెదర్లాండ్స్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ టీమిండియా బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. వరుసగా మొదటి టాప్ 5 బ్యాటర్లంతా రాణించడం విశేషం. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అయితే.. దీపావళి రోజు హండ్రెడ్ వాలా పేల్చాడు. కేవలం 84 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ దుమ్మురేపాడు. 64 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సులతో 102 పరుగులు చేసి చివరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అయ్యర్, రాహుల్ చివరి 10 ఓవర్లలో డచ్ బౌలర్లను చీల్చిచెండారు.మొత్తం మీద అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో 128 పరుగులు చేసి అదరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ అద్భుతమైన స్టార్ట్‌ను అందించారు.
ఈ వరల్డ్ కప్‌లో తొలిసారి రోహిత్ శర్మను డామినేట్ చేస్తూ ఆడాడు గిల్. 32 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మ సైతం 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరి కలిసి తొలి వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ సైతం ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా.. 56 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తం మీద నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఏకంగా 410 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాటర్లు హాఫ్‌సెంచరీలు పూర్తి చేసుకోవడం, మిడిల్డార్‌లోని ఇద్దరు ఆటగాళ్లు సెంచరీతో చేయడంతో భారత క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సెమీస్‌కి ముందు టీమిండియా బ్యాటర్లకు అదిరిపోయే ప్రాక్టీస్ లభించిందని అనుకుంటున్నారు.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న టీమిండియా అదే అన్‌బీటెన్ రికార్డుతోనే సెమీస్‌లోకి అడుగుపెట్టనుంది. ఎందుకంటే.. ప్రస్తుతం నెదర్లాండ్స్ 411 పరుగుల భారీ టార్గెట్ ఛేజ్ చేయడం దాదాపు అసాధ్యమే. ఇకపోతే.. ఈ నెల 15న టీమిండియా, బలమైన ప్రత్యర్థి అయిన న్యూజిలాండ్‌తో తొలి సెమీ ఫైనల్‌లో తలపడనుంది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికే న్యూజిలాండ్‌ను టీమిండియా లీగ్ మ్యాచ్‌లో ఓడించినప్పటికీ.. కివీస్‌తో సెమీస్ అనగానే భారత క్రికెట్ అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొని ఉంది. 2019 వరల్డ్ కప్ సమీస్ సీన్ రిపీట్ అవుతుందేమో అని భయపడుతున్నారు. కానీ, ప్రస్తుతం జట్టు ఉన్న ఫామ్ చూస్తే.. మాత్రం న్యూజిలాండే కాదు ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించేలా కనిపించడంలేదు. మరి ఈ విషయంతో పాటు అయ్యర్, రాహుల్ సెంచరీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Innings Break!
A batting display full of fireworks as centuries from Shreyas Iyer & KL Rahul light up Chinnaswamy 💥#TeamIndia post 410/4 in the first innings 👏👏
Scorecard ▶️ https://t.co/efDilI0KZP#CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/eYeIDYrJum
— BCCI (@BCCI) November 12, 2023