వరల్డ్ కప్ 2023 టైటిల్ సాధించడమే ధ్యేయంగా టీమిండియా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఎదురైన ప్రధాన సమస్య నంబర్ 4 ఆటగాడిగా ఎవరు వస్తారు. ఈ ప్రశ్నకు చాలా మంది చెప్పిన సమాధానం శ్రేయస్ అయ్యర్ అనే. అయితే గాయం కారణంగా జట్టుకు గతకొంతకాలంగా జట్టుకు దూరం అయ్యాడు అయ్యర్. వెన్నుముక గాయం కారణంగా 2023 ఐపీఎల్ తో పాటుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు కూడా అందుబాటులో లేడు. ఈ క్రమంలోనే అతడిని ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసింది బీసీసీఐ. దీంతో టీమ్ సెలక్షన్ కమిటీపై, అయ్యర్ పై విమర్శలు వచ్చాయి. పూర్ ఫామ్ తో, గాయంతో పూర్తి ఫిట్ నెస్ లో లేని అతడిని ఎలా ఎంపిక చేస్తారు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. తాజాగా ఈ విమర్శలన్నింటికి దిమ్మతిరిగే కౌంటర్ తన బ్యాట్ తో ఇచ్చాడు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో ఏకంగా 199 పరుగులతో చెలరేగాడు.
శ్రేయస్ అయ్యర్.. బ్యాక్ ఇంజ్యూరీ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ తో పాటుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు దూరం అయ్యాడు. కాగా.. తాజాగా ఆసియా కప్ కు ఎంపిక చేసిన టీమిండియా స్వ్కాడ్ లో అయ్యర్ కు చోటు దక్కింది. దీంతో టీమ్ సెలక్షన్ కమిటీపై అలాగే శ్రేయస్ అయ్యర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. బ్యాక్ ఇంజ్యూరీకి ఆపరేషన్ చేసుకున్న తర్వాత అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి ఫిట్ నెస్ పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ అనుమానాలన్నింటికి తన బ్యాట్ తో సమాధానం ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన ఫిట్ నెస్ ప్రాక్టీస్ మ్యాచ్ లో దుమ్మురేపాడు అయ్యర్.
50 ఓవర్ల ఈ మ్యాచ్ లో అయ్యర్ ఏకంగా 199 రన్స్ తో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లలపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అదీకాక 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ కూడా చేసి తన ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇటీవలే మ్యాచ్ జరిగినట్లు ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాగా.. ఆసియా కప్ కు తనను సెలక్ట్ చేసిన సెలక్టర్లకు తన ఫిట్ నెస్ ఏంటో తెలియజెప్పాడు. అయితే టీమిండియాలో నంబర్ 4 బ్యాటింగ్ స్థానానికి శ్రేయస్ అయ్యరే సరైన ఆటగాడిగా మేనేజ్ మెంట్ భావిస్తోంది. మరి ఆసియా కప్ ముంగిట 199 రన్స్ కొట్టి తన సత్తా నిరూపించుకున్న అయ్యర్.. 4వ నంబర్ ఆటగాడిగా సరైనోడా? కాదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shreyas Iyer convinced the selectors and team management that he’s fully fit by scoring a stupendous 199 in the practice match. (TOI). pic.twitter.com/cx7fzCahJU
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 24, 2023
ఇదికూడా చదవండి: VIDEO: క్రికెట్ చరిత్రలో కనీవిని ఎరుగని క్యాచ్!