iDreamPost
android-app
ios-app

దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. కమ్​బ్యాక్​కు ఇది సరిపోదు!

  • Published Sep 21, 2024 | 5:27 PM Updated Updated Sep 21, 2024 | 5:27 PM

Shreyas Iyer Slams Quickfire Fifty: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్ ఎట్టకేలకు గర్జించింది. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అయ్యర్.. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్​లో మంచి ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. మెరుపు బ్యాటంగ్​తో అలరించాడు.

Shreyas Iyer Slams Quickfire Fifty: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్ ఎట్టకేలకు గర్జించింది. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అయ్యర్.. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్​లో మంచి ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. మెరుపు బ్యాటంగ్​తో అలరించాడు.

  • Published Sep 21, 2024 | 5:27 PMUpdated Sep 21, 2024 | 5:27 PM
దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. కమ్​బ్యాక్​కు ఇది సరిపోదు!

టీమిండియాలో తక్కువ టైమ్​లోనే మంచి క్రేజ్ సంపాదించిన ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. స్టైలిష్ బ్యాటింగ్​తో మూడు ఫార్మాట్లలో కీలక ప్లేయర్​గా ఎదిగిన అయ్యర్.. గాయం సాకు చూపి డొమెస్టిక్ క్రికెట్​ ఆడనని చెప్పడంతో బీసీసీఐ అతడి కాంట్రాక్ట్​ తొలగించింది. అప్పటి నుంచి అతడి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. మధ్యలో ఐపీఎల్-2024 ట్రోఫీని గెలుచుకొని సంబురాల్లో మునిగినా.. టీ20 వరల్డ్ కప్​కు సెలెక్ట్ కాలేదు. ఇటీవల శ్రీలంక సిరీస్​లో వన్డే టీమ్​కు ఎంపిక చేసినా రాణించలేదు. టెస్ట్ జట్టులోకి ఎంట్రీ కోసం దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ తొలి రౌండ్​లో విఫలమయ్యాడు. దీంతో బంగ్లాదేశ్​ సిరీస్​కు అతడ్ని ఎంపిక చేయలేదు బోర్డు. ఇక అయ్యర్ పనైపోయింది అనుకుంటున్న తరుణంలో ఎట్టకేలకు అతడి బ్యాట్ గర్జించింది.

వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అయ్యర్.. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్​లో మంచి ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. మెరుపు బ్యాటంగ్​తో అలరించాడు. ఇండియా-సీతో జరుగుతున్న మ్యాచ్​లో 37 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఇందులో 7 బౌండరీలతో పాటు 1 భారీ సిక్స్ ఉంది. క్రీజులో ఉన్నంత సేపు అటాకింగ్ బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. ఎడాపెడా షాట్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. పాజిటివ్ క్రికెట్ ఆడుతూ తన బ్యాట్ పవర్ ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేశాడు. తనలో పరుగుల దాహం ఇంకా తగ్గలేదని.. కసి మీద ఉన్నానని చూపించాడు. అయితే టీమిండియాలోకి కమ్​బ్యాక్ ఇవ్వాలంటే ఇది సరిపోదని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. భారత టెస్ట్ జట్టులో తీవ్ర పోటీ ఉన్నందున అయ్యర్ బ్యాట్ నుంచి భారీ స్కోర్లు వస్తే తప్ప కన్సిడర్ చేయరని చెబుతున్నారు.

భారీ సెంచరీలు బాది ఫామ్, ఫిట్​నెస్​ నిరూపించుకుంటే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్​కు అయ్యర్​ను పరిగణనలోకి తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. దులీప్ ట్రోఫీతో పాటు రంజీ ట్రోఫీలోనూ అతడు బ్యాట్​తో పరుగుల వరద పారించాలని.. అప్పుడు సెలెక్టర్ల మీద ఒత్తిడి పడుతుందని సూచిస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో ఇండియా-డీ తొలి ఇన్నింగ్స్​లో 349 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇండియా-బీ 282 పరుగులు చేసింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇండియా-డీ ప్రస్తుతం 4 వికెట్లకు 125 పరుగులతో ఉంది. ఆ టీమ్ 192 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక, హాఫ్ సెంచరీ బాదిన అయ్యర్ భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉన్నా హిట్టింగ్​కు వెళ్లి వికెట్ పారేసుకున్నాడు. అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు పరుగులు పెట్టేది. మరి.. అయ్యర్ ఏ సిరీస్​కల్లా కమ్​బ్యాక్ ఇస్తాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.