Somesekhar
SRHపై అద్భుతమైన విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది కేకేఆర్. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన తర్వాత కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫన్నీ స్పీచ్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..
SRHపై అద్భుతమైన విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది కేకేఆర్. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన తర్వాత కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫన్నీ స్పీచ్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కోల్ కత్తా నైట్ రైడర్స్.. అదే జోరును నాకౌట్ మ్యాచ్ లోనూ చూపించింది. సన్ రైజర్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో నాలుగోసారి ఐపీఎల్ లో ఫైనల్ కు చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్బుత ప్రదర్శన కనబర్చిన కేకేఆర్ టీమ్ సన్ రైజర్స్ ను చిత్తుచేసింది. ఈ విజయం తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫన్నీ స్పీచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తొలి క్వాలిఫయర్ లో భాగంగా సన్ రైజర్స్ విధించిన 160 పరుగుల టార్గెట్ ను కేకేఆర్ కేవలం 13.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దూకుడుగా ఆడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక అతడికి తోడు వెంకటేశ్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 51 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్ కు అజేయంగా 97 పరుగులు జోడించారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో గెలిచిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫన్నీ స్పీచ్ ఇచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ..” దాదాపు పది రోజుల తర్వాత మేం మ్యాచ్ ఆడాము. వర్షం కారణంగా గత రెండు మ్యాచ్ లు రద్దు అయ్యాయి. వివిధ ప్రాంతాలు తిరుగుతూ మ్యాచ్ లు ఆడటం అంత తేలికైన విషయం కాదు. ఇక ఈ మ్యాచ్ లో స్టార్క్, సునీల్ నరైన్ ను వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొచ్చారు. బ్యాటింగ్ లో మేం దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాం. దాన్ని వెంకటేశ్ అయ్యర్ కొనసాగించాడు. అయితే నాకూ, అతడికి ఒక్కటే తేడా ఉంది. వెంకటేశ్ అయ్యర్ తమిళ్ మాట్లాడుతాడు. నేను మాట్లాడలేను.. కానీ అర్ధం చేసుకోగలుగుతాను. అతడు తమిళ్ లో ఏదైనా అడిగితే.. నేను హిందీలో సమాధానం ఇస్తాను” అంటూ నవ్వులు పూయించాడు. కాగా.. వెంకటేశ్ అయ్యర్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించగా.. శ్రేయస్ అయ్యర్ ముంబైలో జన్మించాడు.