Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు అన్యాయం జరిగింది. అతడు ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. దీనికి బోర్డు సెక్రటరీ జై షాదే బాధ్యత.
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు అన్యాయం జరిగింది. అతడు ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. దీనికి బోర్డు సెక్రటరీ జై షాదే బాధ్యత.
Nidhan
కొన్ని నెలలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్న రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఎట్టకేలకు ముగిసింది. అన్ని జట్లను తోసిరాజని మళ్లీ ముంబైనే విన్నర్‌గా నిలిచింది. రంజీ టైటిల్‌ను ఎగరేసుకుపోవడం ఆ జట్టుకు ఇది 42వ సారి కావడం విశేషం. రంజీ ట్రోఫీని ఏ టీమ్ కూడా ఇన్ని సార్లు నెగ్గలేదు. ఆ రకంగా ముంబై పేరు మీద ఎదురులేని రికార్డు నమోదైంది. ఆ టీమ్ ఛాంపియన్‌గా నిలవడంలో కెప్టెన్ అజింక్యా రహానె, వెటరన్ పేసర్ ధవల్ కులకర్ణి, కొత్త కుర్రాడు ముషీర్ ఖాన్‌తో పాటు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పాత్ర కూడా ఎంతగానో ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో 95 పరుగుల సూపర్బ్ నాక్‌తో టీమ్ విక్టరీలో కీలకంగా నిలిచాడు అయ్యర్. అలాంటోడికి అన్యాయం జరిగింది. అయితే దీనికి భారత క్రికెట్ బోర్డు సెక్రటరీ జై షాదే బాధ్యత అని అందరూ అంటున్నారు.
రీసెంట్గా జరిగిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచుల్లో అయ్యర్ సరిగ్గా ఆడకపోవడంతో అతడ్ని తొలగించారు సెలక్టర్లు. వెళ్లి రంజీల్లో ఆడమని అన్నారు. అయితే గత ఏడాది కాలంగా అతడు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇంజ్యురీకి ట్రీట్మెంట్ తీసుకొని వన్డే వరల్డ్ కప్-2023లో ఆడాడు. మెగా టోర్నీ కోసం ఐపీఎల్-2023ను కూడా వదులుకున్నాడీ స్టైలిష్ బ్యాటర్. ప్రపంచ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, సౌతాఫ్రికా సిరీస్‌లోనూ ఆడాడు. అలాగే ఇంగ్లండ్‌తో సిరీస్‌కూ అందుబాటులోకి వచ్చాడు. అయితే సిరీస్‌లోని తొలి రెండు టెస్టుల్లో ఫెయిలవడంతో.. తర్వాతి 3 మ్యాచులకు అతడ్ని తప్పించారు. నేషనల్ డ్యూటీకి దూరంగా ఉన్నాడు కాబట్టి రంజీల్లో ఆడమని ఆదేశించింది బీసీసీఐ. కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అది ఎక్కడ తిరగబెడుతుందోనని భయపడి అయ్యర్ ఆడలేదు.
రంజీల్లో ఆడమని చెప్పినా తమ ఆదేశాలను బేఖాతరు చేయడంతో అయ్యర్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి.. అది తిరగబెట్టే ప్రమాదం ఉండటంతోనే ఆడలేదని చెప్పినా బోర్డు సెక్రటరీ జై షా వినలేదు. ఏ క్రికెటర్ అయినా సరే దేశం తరఫున ఆడని టైమ్‌లో డొమెస్టిక్ క్రికెట్లో పాల్గొనాల్సిందేనని బీసీసీఐ న్యూ రూల్ తీసుకొచ్చింది. దానికి తోడు రంజీల్లో ఆడలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వకపోవడంతో వీళ్ల పోడు పడలేక వచ్చి ఆడాడు. విదర్భతో జరిగిన ఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగాడు అయ్యర్. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 7 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే బ్యాటింగ్ చేసే క్రమంలో మళ్లీ బ్యాక్ పెయిన్ తెచ్చుకున్నాడు. ఈ కారణం వల్లే ఆ మ్యాచ్ ఆఖరి రోజు అతడు ఫీల్డింగ్‌కు దిగలేదు. దీంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచుల్లో అతడు ఆడటం కష్టమని అంటున్నారు.
సో.. రంజీల్లో ఆడకుండా అయ్యర్ రెస్ట్ తీసుకోవడంలో, అతడి భయంలో న్యాయం ఉంది. కానీ బీసీసీఐ పెద్దలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా, దేశానికి అతడు అందించిన సేవల్ని మర్చిపోయి, కావాలనే గాయం సాకు చూపుతున్నాడంటూ సెంట్రల్ కాంట్రాక్ట్ తీసేశారు. పోనీ వాళ్లతో ఎందుకని రంజీల్లో ఆడితే మళ్లీ గాయం తిరగబెట్టింది. అటు సెంట్రల్ కాంట్రాక్ట్ పోయి, ఇటు గాయం కూడా తిరగబెట్టి, ఐపీఎల్ మ్యాచులూ మిస్సయ్యే ప్రమాదం.. ఇలా అన్ని విధాలుగా పాపం అయ్యర్‌కు అన్యాయం జరిగింది. దీనికి బోర్డు, జై షాలదే బాధ్యత అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మళ్లీ అతడి కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అతడికి ఇచ్చే గౌరవమని చెబుతున్నారు. మరి.. అయ్యర్‌కు జరిగిన అన్యాయం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గంభీర్ ధీమా.. స్టార్క్ విషయంలో ఆ భయం లేదట! ఎందుకో తెలుసా?
Shreyas Iyer remained off the field due to back pain for the entire duration of the 4⃣th day’s play during the #RanjiTrophyFinal between Mumbai and Vidarbha.
✍️ @karhacter
READ: https://t.co/gd6MGj5Fay pic.twitter.com/7fUjmewLy9
— Sportstar (@sportstarweb) March 13, 2024