iDreamPost
android-app
ios-app

Shoaib Malik: షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై స్పందించిన సానియా కుటుంబం!

  • Published Jan 21, 2024 | 4:10 PM Updated Updated Jan 21, 2024 | 5:13 PM

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా సానియా మీర్జా కుటుంబం స్పందించింది.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా సానియా మీర్జా కుటుంబం స్పందించింది.

  • Published Jan 21, 2024 | 4:10 PMUpdated Jan 21, 2024 | 5:13 PM
Shoaib Malik: షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై స్పందించిన సానియా కుటుంబం!

సెలబ్రిటీల పెళ్లిళ్లు, డివోర్స్​కు సంబంధించిన అంశాలపై ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటికి మించి మ్యారేజెస్ చేసుకోవడం కూడా ఈ మధ్య ఎక్కువైపోయింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పెళ్లి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. దీంతో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నుంచి అతడు విడిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెలబ్రిటీల్లో డివోర్స్ కేసులు కామనే. అయితే మాలిక్ హఠాత్తుగా పెళ్లి చేసుకోవడం, సానియాకు విడాకులు ఇచ్చిన విషయం ఇన్నాళ్లూ బయటకు రాకపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా ఈ అంశంపై సానియా మీర్జా కుటుంబం స్పందించింది. షోయబ్ వివాహం మీద ఆమె టీమ్, కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.

సానియా మీర్జా తన వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ గోప్యంగానే ఉంచిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. ‘సానియా తన పర్సనల్ విషయాలను ఎప్పుడూ సీక్రెట్​గానే ఉంచుకుంది. పబ్లిక్ లైఫ్​కు దూరంగానే ఆమె వ్యవహరించింది. ఇప్పుడు షోయబ్ మాలిక్ మూడో వివాహం చేసుకోవడంతో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. వీళ్లిద్దరూ కొన్ని నెలల కిందటే విడాకులు తీసుకున్నారు. ఇంకో మ్యారేజ్ చేసుకున్న షోయబ్ కొత్త జర్నీ బాగుండాలని సానియా కోరుకుంటూ విషెస్ తెలిపింది’ అని ఆ ప్రకటనలో సానియా కుటుబం చెప్పుకొచ్చింది. ఇక, షోయబ్ మాలిక్-సానియా మీర్జా విడిపోవడానికి గల స్పష్టమైన కారణాలు ఏంటనేది తెలియరాలేదు. అయితే మాలిక్ వివాహేతర సంబంధాలే దీనికి రీజన్ అని పాకిస్థాన్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడం అతడి కుటంబ సభ్యులకు కూడా ఇష్టం లేదని సమాచారం. అందుకే అతడి వివాహ వేడుకకు ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ అటెంట్ అవ్వలేదని తెలిసింది. ఇప్పటికే డివోర్స్ తీసుకున్న సనా జావెద్​ను మాలిక్ పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదని టాక్. సానియా మీర్జాతో షోయబ్ విడాకులు తీసుకోవడం కూడా అతడి సోదరికి నచ్చలేదట. అతడి వివాహేతర సంబంధాల వల్లే కుటంబం నుంచి సపోర్ట్ దొరకలేదని.. వాళ్లు అతడ్ని దూరం పెట్టారని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇక, మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు శనివారం సోషల్ మీడియాలో మాలిక్ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. మ్యారేజ్ అయిన కొన్ని గంటల్లోనూ అతడు మరో రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్​లో 13 వేలకు పైగా రన్స్ చేసిన తొలి ఆసియా క్రికెటర్​గా అవతరించాడు షోయబ్. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్​లో ఫార్చూన్ బరిషల్ తరఫున బ్యాటింగ్ చేస్తూ ఈ రికార్డును క్రియేట్ చేశాడు. ఆ మ్యాచ్​లో 18 బంతుల్లో 17 రన్స్ చేసి తన టీమ్​ను గెలిపించాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş