SNP
పాకిస్థాన్ క్రికెట్ షోయబ్ మాలిక్ మూడు పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులిచ్చి మూడో పెళ్లి చేసుకున్న మాలిక్‌పై క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్‌కు దిగారు. తాజాగా బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో..
పాకిస్థాన్ క్రికెట్ షోయబ్ మాలిక్ మూడు పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులిచ్చి మూడో పెళ్లి చేసుకున్న మాలిక్‌పై క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్‌కు దిగారు. తాజాగా బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో..
SNP
పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పేరు గత రెండు రోజులుగా వార్తల్లో మారుమోగిపోతుంది. అందుకు కారణం అతను మూడో పెళ్లి చేసుకోవడమే. పాకిస్థాన్‌కు చెందిన ఆయేషా సిద్ధిఖీని తొలి వివాహం చేసుకున్న మాలిక్.. ఆ తర్వాత 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను నిఖా చేసుకున్నాడు. వారి రెండు దేశాల్లోనూ సంచలనం సృష్టించింది. మాలిక్-సానియా వివాహం హైదరాబాద్‌లోనే జరగడం విశేషం. వీరి పెళ్లి సయమంలో సానియాపై తీవ్ర విమర్శలు సైతం వచ్చాయి. ఒక పాకిస్థానీని పెళ్లి చేసుకోవడంతో.. కొంతమంది భారత అభిమానులు సానియాపై విమర్శలు చేశారు. కానీ, అవేవి పట్టించుకోని సానియా.. తన భర్తతో దుబాయ్‌లో కాపురం పెట్టింది.
కొన్నేళ్లుకు వీరికి ఇజ్‌హాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. అయితే.. కొంతకాలంగా సానియా-మాలిక్ దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి. వాటిని ఇద్దరూ ఖండించలేదు. తాజాగా మాలిక్ పాకిస్థాన్ సీరియల్ నటి సనా జావేద్‌ను నిఖా చేసుకుని, పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో.. సానియా-మాలిక్ విడాకులు తీసుకున్నారనే విషయం ప్రపంచానికి తెలిసింది. ఈ విషయంపై సానియా కూడా స్పందిస్తూ.. ఒక పోస్ట్‌ను విడుదల చేసింది. అయితే.. మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. పైగా ఎంతో నమ్మి పెళ్లి సానియాను వదిలేసి.. అంతకు ముందే పెళ్లి అయినా సనా జావేద్‌ను పెళ్లి చేసుకోవడంతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్ సైతం మాలిక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో మాలిక్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు. ఫార్చ్యూన్ బరిషల్ vs ఖుల్నా టైగర్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో మాలిక్ ఒక ఓవర్ బౌలింగ్ వేసి.. అందులో ఏకంగా 3 నో బాల్స్ వేశాడు. ఫార్చ్యూన్ బరిషల్ తరఫున ఆడుతున్న మలిక్.. ఖుల్నా టైగర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్‌లో ఏకంగా మూడు నో బాల్స్ వేయడంతో పాటు 18 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో.. మాలిక్ మూడు పెళ్లిళ్లకు ఆ మూడు నో బాల్స్‌కు లింక్ చేస్తూ.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. లైఫ్‌లో ఎప్పుడో ఓవర్‌స్టెప్ వేశాడని, ఈ నో బాల్స్‌తో మ్యాచ్ ఫిక్స్‌కి పాల్పడుతున్నాడంటూ మాలిక్‌పై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. మరి మాలిక్‌పై జరుగుతున్న ఈ ట్రోలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BPL board should investigate Shoaib Malik over.
His team Fortune Barishal lost the match after scoring 187 in 20 overs.
Shoaib Malik bowled 3 No Balls in an over and non striker Anamul not interested to rotate strike.Looks like Shoaib Malik fixed this over with fixers.… pic.twitter.com/98WiihSyU8
— Satya Prakash (@Satya_Prakash08) January 23, 2024