iDreamPost
android-app
ios-app

Shoaib-Sania: షోయబ్-సానియా విడాకులు.. డివోర్స్ వెనుక షాకింగ్ నిజాలు!

  • Published Jan 24, 2024 | 8:18 AM Updated Updated Jan 24, 2024 | 8:18 AM

పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం అతడు మూడో పెళ్లి చేసుకోవడమే. దీంతో సానియా మీర్జాకు విడాకులు ఇచ్చాడనే విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ డివోర్స్ వెనుక షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.

పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం అతడు మూడో పెళ్లి చేసుకోవడమే. దీంతో సానియా మీర్జాకు విడాకులు ఇచ్చాడనే విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ డివోర్స్ వెనుక షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.

  • Published Jan 24, 2024 | 8:18 AMUpdated Jan 24, 2024 | 8:18 AM
Shoaib-Sania: షోయబ్-సానియా విడాకులు.. డివోర్స్ వెనుక షాకింగ్ నిజాలు!

పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ఒకడిగా నిలుస్తున్నాడు. దీనికి కారణం అతడు మూడో పెళ్లి చేసుకోవడమే. ఈ మ్యారేజ్ అంశంతో అతడు భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు విడాకులు ఇచ్చాడనే విషయం ప్రపంచానికి తెలిసింది. పాక్​కు చెందిన ఆయేషా సిద్ధిఖీని తొలి వివాహం చేసుకున్న మాలిక్.. అనంతరం 2010లో సానియాను నిఖా చేసుకున్నాడు. వాళ్ల మ్యారేజ్​ హైదరాబాద్​లోనే జరిగింది. ఒక పాకిస్థానీని పెళ్లి చేసుకోవడం ఏంటంటూ.. అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చినా అవేవీ పట్టించుకోకుండా భర్తతో దుబాయ్​లో కాపురం పెట్టింది సానియా. వీరికి ఇజ్​హాన్ మీర్జా మాలిక్ అనే ఓ కొడుకు ఉన్నాడు. అయితే గత కొన్నాళ్లుగా సానియా-మాలిక్ దూరంగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. పాక్ సీరియల్ నటి సనా జావేద్​ను మూడో పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ ఫొటోలు పెట్టడంతో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. అయితే సానియా-మాలిక్ విడాకుల వెనుక షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

సానియా-మాలిక్ డివోర్స్​కు ప్రధాన కారణం అక్రమ సంబంధమేనట. సానియా మీర్జాను షోయబ్ మోసం చేశాడని పాకిస్థాన్ మీడియా కోడై కూస్తోంది. అతడు వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఇద్దరి వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పడటానికి రీజన్ అని అక్కడి మీడియా నివేదిక పేర్కొంది. గత మూడేళ్లుగా సనా జావేద్-షోయబ్ మాలిక్ సీక్రెట్​గా కలుసుకుంటున్నారని.. అయితే అప్పటికే సనాకు ఉమైర్ జస్వాల్​తో మ్యారేజ్ అయిందని ఆ రిపోర్టు తెలిపింది. ‘జీతో పాకిస్థాన్’ అనే షోలో సనాను షోయబ్ కలిశాడట. అక్కడ వాళ్ల మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ఫ్రెండ్​షిప్​గా మారిందట. ఇద్దరూ తరచూ కలుసుకోవడం మొదలుపెట్టారని టాక్. తాను ఏదైనా షోకు రావాలంటే సనా జావేద్​ను గెస్ట్​గా పిలిస్తేనే వస్తానని మాలిక్ కండీషన్స్ పెట్టేవాడని ఆ నివేదిక పేర్కొంది. మ్యారేజ్​కు కొన్ని రోజుల ముందే సనా డివోర్స్ విషయం ఉమైర్ జస్వాల్​కు చెప్పిందని.. ఈ డిసిషన్​తో అతడు షాకయ్యాడని ఆ మీడియా సంస్థ వెల్లడించింది.

sania mirza shoaib malik

‘సానియా మీర్జాను షోయబ్ మాలిక్ మోసం చేయడం వల్లే వాళ్లిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. నటి సనా జావేద్​, మాలిక్​ గత మూడేళ్లుగా సీక్రెట్​గా కలుసుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధమే వాళ్లిద్దర్నీ దూరం చేసింది. ఈ విషయంలో షోయబ్​ కుటుంబం కూడా సానియాకే సపోర్ట్​ను ఇచ్చింది. సానియా-షోయబ్ విడాకుల వ్యవహారం శాంతియుతంగా ముగిసింది. వాళ్లు విడిపోయారనేది కూడా ఎవరికీ తెలియదు. ఇదంతా సైలెంట్​గా జరిగిపోయింది’ అని పాక్​ మీడియా వివరించింది. మాలిక్ మూడో పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు హాజరయ్యారని తెలిపింది. దీంతో షోయబ్ మాలిక్ పై పాక్ క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అక్రమ సంబంధంతో సానియాను మోసం చేశాడని అంటున్నారు. ఇక, మూడో పెళ్లి ఎఫెక్ట్ మాలిక్​పై బాగానే పడింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్​లో పాల్గొన్న అతడు ఒక ఓవర్​లో ఏకంగా 3 నో బాల్స్ వేశాడు. దీంతో అతడ్ని అభిమానులు ఏకిపారేస్తున్నారు. నో బాల్స్​తో ఫిక్సింగ్​కు పాల్పడుతున్నాడని మాలిక్​ మీద కొంతమంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి.. సానియా-మాలిక్ డివోర్స్ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom