SNP
క్రికెట్ అభిమానులే కాకుండా, మాజీ క్రికెటర్లు సైతం పాక్ క్రికెటర్లను చీల్చి చెండాడతున్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ పాకిస్థాన్ క్రికెటర్ల ఫిట్‌నెస్ సరిగా లేదని మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో మాజీ దిగ్గజ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ..
క్రికెట్ అభిమానులే కాకుండా, మాజీ క్రికెటర్లు సైతం పాక్ క్రికెటర్లను చీల్చి చెండాడతున్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ పాకిస్థాన్ క్రికెటర్ల ఫిట్‌నెస్ సరిగా లేదని మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో మాజీ దిగ్గజ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ..
SNP
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లపై విమర్శల వర్షం కురుస్తోంది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై, ఆ తర్వాత శ్రీలంకపై విజయాలతో మంచి ఊపు మీద కనిపించిన పాకిస్థాన్.. టీమిండియాతో ఈ నెల 14న జరిగిన మ్యాచ్ తర్వాత నుంచి ఓ పసికూన టీమ్‌లా మారిపోయింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలోనూ చావు దెబ్బతింది. ఇప్పుడు పసికూన ఆఫ్ఘనిస్థాన్ చేతిలోనూ ఓడిపోయింది. ఈ ఓటమి పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. దీంతో వారు విమర్శలతో పాక్ టీమ్‌పై విరుచుకుపడుతున్నారు.
అయితే.. క్రికెట్ అభిమానులే కాకుండా, మాజీ క్రికెటర్లు సైతం పాక్ క్రికెటర్లను చీల్చి చెండాడతున్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ పాకిస్థాన్ క్రికెటర్ల ఫిట్‌నెస్ సరిగా లేదని మండిపడిన విషయం తెలిసిందే. ఒక్కరు కూడా సరైన ఫిట్‌నెస్‌తో లేరని, చెత్త ఫీల్డింగ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా మరో మాజీ దిగ్గజ క్రికెటర్ షోయబ్ అక్తర్ సైతం పాకిస్థాన్ టీమ్‌పై విమర్శలు కురిపించాడు. పాకిస్థాన్ టీమ్‌లో ఒక్కరు కూడా పాకిస్థాన్‌లోని యువకులకు స్ఫూర్తిగా నిలిచేలేరని అన్నాడు. వారిని చూసి ఎవరూ కూడా ఇన్స్పైర్ అయ్యేలా పాక్ క్రికెటర్లు లేరంటూ ఘాటుగా స్పందించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఓపెనర్ షఫీక్ 58, కెప్టెన్ బాబర్ అజమ్ 74, షదాబ్ ఖాన్ 40, ఇఫ్తికార్ అహ్మద్ 40 పరుగులతో రాణించారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్, నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న నూర్ 3 వికెట్లు పడగొట్టాడు. నవీన్ ఉల్ హక్ 2 వికెట్లతో రాణించాడు. నబీ, అజ్మతుల్లా చెరో వికెట్ తీశారు. ముజీబ్, రషీద్ ఖాన్‌లకు వికెట్ పడకపోయినా.. కట్టుదిట్టంగా వేశారు. 283 పరుగుల టార్గెట్‌ను ఆఫ్ఘాన్ ఎంతో కంఫర్ట్‌బుల్‌గా ఛేదించింది. 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 286 రన్స్ చేసి గెలిచింది. ఓపెనర్లు గుర్బాజ్ 65, ఇబ్రహీం జద్రాన్ 87 అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. తర్వాత రహమత్ 77, హస్మతుల్లా 48 మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. మరి పాకిస్థాన్ చెత్త ప్రదర్శనపై అక్తర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shoaib Akhtar said, “there isn’t a single Pakistani cricketer currently who inspires young kids to look up to cricket”. pic.twitter.com/Siyf89QZgo
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 24, 2023
ఇదీ చదవండి: VIDEO: పాక్ ఓటమి.. రషీద్ ఖాన్‌తో కలిసి డాన్స్ వేసిన టీమిండియా క్రికెటర్!