iDreamPost

ఇండియా-శ్రీలంక మ్యాచ్.. పాకిస్థాన్ ఫ్యాన్స్ పై అక్తర్ ఆగ్రహం!

  • Author Soma Sekhar Published - 03:52 PM, Wed - 13 September 23
  • Author Soma Sekhar Published - 03:52 PM, Wed - 13 September 23
ఇండియా-శ్రీలంక మ్యాచ్.. పాకిస్థాన్ ఫ్యాన్స్ పై అక్తర్ ఆగ్రహం!

ఆసియా కప్ లో భాగంగా సూపర్ 4 మ్యాచ్ లో ఇండియా-శ్రీలంక జట్లు తలపడ్డ సంగతి తెలిసిందే. ఇక ఈ లో స్కోరింగ్ మ్యాచ్ లో టీమిండియా 41 పరుగుల తేడాతో లంకపై సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రీలంక యువ సంచలనం దునిత్ వెల్లలాగే స్పిన్ ధాటికి 213 పరుగులకే కుప్పకూలింది. అతడు 5 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. అనంతరం 214 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను 172 పరుగులకే ఆలౌట్ చేసింది భారత జట్టు. కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ బౌలింగ్ సత్తా ఏంటో చూపుతూ.. 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ లోస్కోరింగ్ మ్యాచ్ లో లంక ఓడిపోవడంతో.. పాకిస్థాన్ ఫ్యాన్స్ శ్రీలంకపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పాక్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

భారత్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 41 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో లంక ఓడిపోవడంతో.. లంక ఫ్యాన్స్ కంటే ఎక్కువగా బాధపడుతున్నారు పాక్ ఫ్యాన్స్. దానికి కారణం లేకపోలేదు. ఆసియా కప్ ఫైనల్ కు పాక్ జట్టు రాకుండా అడ్డుకునేందుకే టీమిండియా చేతిలో శ్రీలంక ఓడిపోయిందని.. పాక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్ తో పాక్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. శ్రీలంక-ఇండియా మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని పాక్ అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఇక ఈ ఆరోపణలపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తాజాగా స్పందించాడు. లంక మ్యాచ్ ఫిక్స్ చేసిందన్న మీమ్స్, ట్రోల్స్ చేసిన పాక్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా షోయబ్ అక్తర్ మాట్లాడుతూ..”ఇండియా చేతిలో కావాలనే ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోయిందనే విధంగా పాక్ అభిమానులు మీమ్స్, మెసేజ్ లు చేస్తున్నారు. వారు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. వారు చేసేదంతా తప్పని నిరూపించగలను. ఈ ఫిక్సింగ్ ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని ఈ విధంగా చేయోద్దని హెచ్చరిస్తున్నాను” అంటూ అక్తర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా.. ఈ మ్యాచ్ లో శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేసిందని, దునిత్ వెల్లలాగే, అసలంక సూపర్ బౌలింగ్ తో టీమిండియాను కట్టడిచేశారని కితాబిచ్చాడు షోయబ్ అక్తర్. లంక యువ సంచలనం 43 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో పాటుగా 5 వికెట్లతో సత్తాచాడని వెల్లలాగేని ప్రశంసించాడు. ఇక ఈ మ్యాచ్ లో విజయం కోసం శ్రీలంక చివరి వరకు తీవ్రంగా పోరాడిందని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇక గత మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు ఇలాంటి పోటీని ఇవ్వలేదని గుర్తుచేశాడు. పాక్ ఫాస్ట్ బౌలర్లు సరిగ్గా ఆడలేదు, ఇలాంటి సందర్భంలో ఫిక్సింగ్ జరిగిందని ఎలా చెప్పగలం అంటూ.. తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు. మరి పాక్ ఫ్యాన్స్ పై అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి