SNP
టీమిండియా యువ సంచలనం శివమ్ దూబే.. ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శివాలెత్తి ఆడుతున్నాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో పట్టుకుంటూ.. టీమిండియా భవిష్యత్తు స్టార్‌గా ఎదుగుతున్నాడు. అయితే.. దూబే సక్సెస్‌తో ఓ భారత క్రికెటర్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మరి ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా యువ సంచలనం శివమ్ దూబే.. ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శివాలెత్తి ఆడుతున్నాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో పట్టుకుంటూ.. టీమిండియా భవిష్యత్తు స్టార్‌గా ఎదుగుతున్నాడు. అయితే.. దూబే సక్సెస్‌తో ఓ భారత క్రికెటర్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మరి ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
శివమ్ దూబే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో మారుమోగిపోతున్న పేరు. ఇటు బౌలింగ్‌లో అటు బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024 టీమ్‌లో చోటే లక్ష్యంగా సత్తా చాటుతున్న ఈ కుర్రాడు.. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో దుమ్మురేపుతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా రెండు సూపర్ హాఫ్ సెంచరీలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే.. ఈ రెండు హాఫ్ సెంచరీల్లోనూ ప్రత్యేకత ఉండటం విశేషం. తొలి టీ20లో ఒక వైపు వికెట్లు పడుతున్నా.. ఎంతో బాధ్యతగా ఆడి జట్టును గెలిపించాడు. రెండో టీ20లో ఒక వైపు యశస్వి జైస్వాల్ చెలరేగుతుంటే.. మరో ఎండ్‌లో తాను కూడా అదే వేగంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
తొలి టీ20లో 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 60 పరుగులు చేసి దూబే.. రెండో టీ20లో కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఆఫ్ఘాన్ సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ నబీ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఏకంగా మూడు వరుస సిక్సులతో దూబే విధ్వంసం సృష్టించాడు. అయితే.. దూబే ఈ రేంజ్‌లో సక్సెస్ అవుతుంటే.. ప్రత్యర్థుల కంటే.. టీమిండియాలోని ఒక స్టార్ క్రికెటర్‌కు భయపట్టుకుందని భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. దూబే ఇలాగే ఆడితే.. ఇక ఆ స్టార్ క్రికెటర్ కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే అంటున్నారు. మరి దూబే సక్సెస్ వల్ల ఎవరి అంత డేంజర్‌గా మారుతుందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియాలో హార్ధిక్ పాండ్యా స్టార్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ లేనప్పుడు అతనే టీ20ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, ఇప్పుడు అతను గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. ఎప్పుడు గాయాలతో సహవాసం చేసే.. పాండ్యా టీమ్‌లో ఎప్పుడుంటాడో ఎప్పుడుండడో చెప్పడం కష్టం. అందుకే రాబోయే టీ20 వరల్డ్ కప్ 2024 కోసం పాండ్యా రెడీగా ఉన్నా కూడా.. అతనికి బ్యాక్ అప్‌గా ఓ యంగ్ ప్లేయర్‌ను సిద్ధం చేసే పనిలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకోసమే జట్టులో శివమ్ దూబేకు అవకాశాలు కల్పిస్తూ.. ఒక నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా రూపొందిస్తున్నారు. ఆఫ్ఘాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ శివమ్ దూబే వికెట్లు పడగొట్టాడు. ఇలా టీమిండియాలో పాండ్యా ప్లేస్‌ను ఆక్రమించేందుకు దూబే తన వందశాతం ఎఫర్ట్ పెడుతున్నాడు. అలాగే అతనికి టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తోంది. మరి దూబే ఇలాగే చెలరేగి ఆడితే.. పాండ్యాను పక్కనపెట్టి అతన్నే కొనసాగించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకు కంటే టీ20 అంటే కుర్రాళ్ల గేమ్. మరి దూబే సక్సెస్.. పాండ్యాకు డేంజర్ బెల్స్ మోగిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Up, Up and Away!
Three consecutive monstrous SIXES from Shivam Dube 🔥 🔥🔥#INDvAFG @IDFCFIRSTBank pic.twitter.com/3y40S3ctUW
— BCCI (@BCCI) January 14, 2024