iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్ కప్.. శివమ్ దూబేపై వేటు? ఆ స్టార్ ప్లేయర్ కు చోటు!

  • Published May 20, 2024 | 9:53 PM Updated Updated May 20, 2024 | 9:53 PM

టీ20 వరల్డ్ కప్ లో శివమ్ దూబే ప్లేస్ కు ఎసరొచ్చేలా ఉంది. ప్రస్తుతం దారుణంగా వైఫల్యం అవుతున్న అతడి ప్లేస్ లో.. మరో స్టార్ ప్లేయర్ ను తీసుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో శివమ్ దూబే ప్లేస్ కు ఎసరొచ్చేలా ఉంది. ప్రస్తుతం దారుణంగా వైఫల్యం అవుతున్న అతడి ప్లేస్ లో.. మరో స్టార్ ప్లేయర్ ను తీసుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్.. శివమ్ దూబేపై వేటు? ఆ స్టార్ ప్లేయర్ కు చోటు!

శివమ్ దూబే.. ఐపీఎల్ 2024 సీజన్ ఫస్ట్ హాఫ్ లో దుమ్మురేపాడు. దాంతో టీ20 వరల్డ్ కప్ టీమ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కేఎల్ రాహుల్, శుబ్ మన్ గిల్ లాంటి తన కంటే సీనియర్ ప్లేయర్లను కాదని జట్టులోకి దూసుకొచ్చాడు. స్పిన్నర్లను ఎదుర్కొవడంలో సిద్ధహస్తుడు అన్న పేరుగాంచిన దూబే.. ఇప్పుడ అదే స్పిన్ కు అతలాకుతలం అవుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో సీఎస్కేకు మిడిలార్డర్ లో వెన్నముకగా నిలిచాడు. దాంతో వరల్డ్ కప్ జట్టులోకి పిలుపొచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ కు ఎసరొచ్చేలా ఉంది. వరల్డ్ కప్ టీమ్ నుంచి అతడిని తొలగించి.. అతడి ప్లేస్ లో హిట్టర్ ను దింపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

శివమ్ దూబే.. ఐపీఎల్ 2024 ఫస్ట్ హాఫ్ లో దుమ్మురేపాడు. తొలి 9 మ్యాచ్ ల్లో 172 స్ట్రైక్ రేట్ తో 350 పరుగులు చేశాడు. ఈ ఫామ్ చూసి బీసీసీఐ అతడిని హిట్టర్ కింద టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసింది. ఎప్పుడైతే.. వరల్డ్ కప్ కు దూబే సెలెక్ట్ అయ్యాడో.. అప్పటి నుంచి అతడికి దరిద్రం పట్టుకుంది. ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్ ల్లో కేవలం 46 రన్స్ మాత్రమే చేశాడు. సిక్సర్ల కింగ్ గా పేరుగాంచిన దూబే.. తొలి 9 మ్యాచ్ ల్లో 26 సిక్సులు కొట్టగా.. ఆ తర్వాత ఆడిన మ్యాచ్ ల్లో కేవలం రెండంటే రెండు సిక్సర్లు మాత్రమే బాదాడు.

అయితే టీ20 ప్రపంచ కప్ ముందు దూబే వైఫల్యం టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ఓ వార్త వైరల్ గా మారింది. అదేంటంటే? టీ20 వరల్డ్ కప్ కు ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకోవడానికి మే 25 వరకు అవకాశం ఉంది. దాంతో పూర్ ఫామ్ లో ఉన్న దూబేను పక్కన పెట్టి.. అతడి స్థానంలో హిట్టర్ రింకూ సింగ్ ను తీసుకోవాని చూస్తోందట. దూబేను స్టాండ్ బై ప్లేయర్ల లిస్ట్ లోకి పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ రానున్న రోజుల్లో వచ్చే ఛాన్స్ లేకపోలేదని కొందరు క్రీడా పండితులు పేర్కొంటున్నారు. మరి దూబే ప్లేస్ లో రింకూను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.