IND vs SL: అంతా అర్షదీప్‌ను తిడుతున్నారు! కానీ, అసలు తప్పు ఈ స్టార్‌ బ్యాటర్‌దే?

Shivam Dube, IND vs SL, Arshdeep Singh: శ్రీలంకతో మ్యాచ్‌ టై అవ్వడానికి కారణం అర్షదీప్‌ సింగ్‌ అంటూ.. అంతా అతన్ని తిడుతున్నారు. కానీ, అసలు విలన్‌ వేరే ఉన్నాడు. అతనెవరో ఎలా కారణం అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

Shivam Dube, IND vs SL, Arshdeep Singh: శ్రీలంకతో మ్యాచ్‌ టై అవ్వడానికి కారణం అర్షదీప్‌ సింగ్‌ అంటూ.. అంతా అతన్ని తిడుతున్నారు. కానీ, అసలు విలన్‌ వేరే ఉన్నాడు. అతనెవరో ఎలా కారణం అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

231 పరుగుల టార్గెట్‌.. అప్పటికే రోహిత్‌ శర్మ సూపర్‌ బ్యాటింగ్‌తో లంక బౌలర్లను కుమ్మేశాడు. టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేస్తూ 30 ప్లస్‌ బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించి మంచి శుభారంభం అందించాడు.. టీమ్‌లో విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ వంటి హేమాహమి బ్యాటర్లంతా ఉన్నారు.. అయినా కూడా టీమిండియా మ్యాచ్‌ గెలవలేకపోయింది. శ్రీలంక ఎంత కొట్టిందో.. సరిగ్గా 230 పరుగులు చేసి మ్యాచ్‌ టై చేసుకుంది. మొత్తానికి మ్యాచ్‌ అయిపోయాక.. చాలా మంది క్రికెట్‌ అభిమానులు అర్షదీప్‌ సింగ్‌పై పడ్డారు. గెలిచే మ్యాచ్‌ టై అయ్యేందుకు అతనే కారణమంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు.

14 బంతుల్లో 1 రన్‌ కావాల్సిన సమయంలో చేతిలో ఒక్కటే వికెట్‌ ఉన్నప్పుడు.. అర్షదీప్‌ సింగ్‌ అలాంటి అగ్రెసివ్‌ షాట్‌కు ప్రయత్నించాల్సింది కాదు. కానీ, అతనో టెయిలెండర్‌ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ చేసేందుకు తీసుకున్న శివమ్‌ దూబే అవుట్‌ అయిన సమయంలో కూడా టీమిండియా విజయానికి ఒక్క పరుగు మాత్రమే కావాలి. ఆ సమయంలో అతను అవుట్‌ అయ్యాడు. కానీ, అతను బ్యాటర్‌. విజయానికి ఒక రన్‌ కావాల్సిన సమయంలో ఒక బ్యాటర్‌ అవుట్‌ అవ్వడానికి, ఒక బౌలర్‌ అవ్వడానికి తేడా ఉంటుంది. అర్షదీప్‌ సింగ్‌ ఒక బౌలర్‌గా తన పని తాను బాగానే చేశాడు. కానీ, ఇక్కడ విఫలమైంది టీమిండియా బ్యాటర్లే.

అందులోనూ ముఖ్యంగా శివమ్‌ దూబేను తప్పుబట్టాలని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. చివర్లో వికెట్లు పడుతున్నా.. టెయిలెండర్లతో కలిసి దూబే చివరి వరకు బాగానే నెట్టుకొచ్చాడు. లాస్ట్‌లో ఏదో తేడా కొడుతుంది అన్న సమయంలో.. సిక్స్‌, ఫోర్‌తో మ్యాచ్‌ను కూడా టై చేశాడు. కానీ, గెలవాలంటే ఒక రన్‌ కావాలి, నేను అవుట్‌ అయితే సరిగ్గా బ్యాటింగ్‌ రాని ఓ బౌలర్‌ క్రీజ్‌లోకి వస్తాడు. కాబట్టి నేను మ్యాచ్‌ను పూర్తి చేయాలని దూబే ఆలోచించి ఉంటే.. జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ను ఫినిష్‌ చేసేవాడు. కానీ, అతను అలా చేయకుండా వికెట్‌ ఇచ్చేశాడు. మరో ఎండ్‌లో సిరాజ్‌ కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. వికెట్ల వేటలో ఉన్న హసరంగా, అసలంకాలను సమర్థవంగా ఎదుర్కొన్నాడు. 11 బంతుల్లో 5 పరుగులు చేసి మెరుగ్గా బ్యాటింగ్‌ చేశాడు. కానీ, శివమ్‌ దూబే ఆ రన్‌ను జాగ్రత్తగా చేసి ఉంటే.. హీరో అయ్యేవాడు. మ్యాచ్‌ టై అయ్యేందుకు అతనే అసలు కారణం అయినా.. చివర్లో అర్షదీప్‌ ఆడేందుకు ప్రయత్నించిన షాట్‌ వల్లే అతను తిట్లు తింటున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments