సిక్సుల వర్షం కురిపించిన షిమ్రాన్ హెట్మెయర్! కేవలం 39 బంతుల్లోనే..

Shimron Hetmyer, CPL 2024: కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విండీస్‌ వీరుడు హెట్మెయర్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ రెచ్చిపోయాడు. ఫోర్లు కాకుండా.. ఓన్లీ సిక్సులతో బౌలర్లను చీల్చి చెండాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Shimron Hetmyer, CPL 2024: కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విండీస్‌ వీరుడు హెట్మెయర్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ రెచ్చిపోయాడు. ఫోర్లు కాకుండా.. ఓన్లీ సిక్సులతో బౌలర్లను చీల్చి చెండాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కరేబియన్‌ లీగ్‌ 2024లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యచ్‌లో షిమ్రాన్‌ హెట్మెయర్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం సిక్సులతోనే ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. అతని విధ్వంసానికి.. రహమనుల్లా గుర్బాజ్‌ అరాచకం కూడా తోడవ్వడంతో.. గయానా భారీ స్కోర్‌ నమోదు చేసింది. వీరిద్దరితో పాటు కీమో పాల్‌ సైతం 14 బంత్లులో 4 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు చేసి.. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో గయానా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

గయానా ఇన్నింగ్స్‌లో.. ముఖ్యంగా హెట్మెయర్‌ ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడుకోవాలి. 53 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన హెట్మెయర్‌.. సంచలన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై పడిపోయాడు. ఏకంగా 11 సిక్సులతో 39 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. విశేషం ఏంటంటే.. హెట్మెయర్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కటంటే ఒక్క ఫోర్‌ కూడా లేదు, అన్ని సిక్సులే. ఇక ఓపెనర్‌ గుర్బాజ్‌ సైతం విధ్వంసకర బ్యాటింగ్‌ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో 69 పరుగులు చేసి అదరగొట్టాడు. చివర్లో కీమో ప్రిటోరియస్‌, రైఫెర్‌ భారీ షాట్లతో అదరగొట్టారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. హెట్మెయర్‌ 91, గుర్బాజ్‌ 69, కీమో 38 పరుగులు చేసి రాణించారు. పేట్రియాట్స్‌ టీమ్‌లోని ర్యాన్‌ జాన్‌కి తప్పా మిగతా బౌలర్లందరికీ తలో వికెట్‌ దక్కింది. ఇక 267 పరుగుల టఫ్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన పేట్రియాట్స్‌ జట్టు 18 ఓవర్లలో 226 పరుగుల చేసి ఆలౌట్‌ అయింది. ఆండ్రీ ఫ్లెచర్‌ 33 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సులతో 81 పరుగులు చేసి దుమ్మురేపినా.. మ్యాచ్‌ గెలిపించలేకపోయాడు. మిగతా బ్యాటర్లలో షెఫర్డ్‌ 12 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 34, కైల్‌ మేయర్స్‌ 17 బంతుల్లో 28 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో హెట్మెయర్‌ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments