iDreamPost
android-app
ios-app

లైఫ్‌లో సర్వం కోల్పోయి.. కసిగా IPLలోకి! ప్రతి జట్టుని భయపెడుతున్నాడు!

  • Published Mar 22, 2024 | 7:52 PM Updated Updated Mar 22, 2024 | 7:53 PM

Shikhar Dhawan, IPL 2024: ఐపీఎల్‌ 2024 కోసం సర్వం సిద్ధమైంది. అయితే.. ఈ సీజన్‌లో ఓ ఆటగాడు మిగిలిన 9 జట్లను దారుణంగా భయపెడుతున్నాడు. ఆ ఆటగాడు ఎవరు? ఎందుకంత కసిగా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం..

Shikhar Dhawan, IPL 2024: ఐపీఎల్‌ 2024 కోసం సర్వం సిద్ధమైంది. అయితే.. ఈ సీజన్‌లో ఓ ఆటగాడు మిగిలిన 9 జట్లను దారుణంగా భయపెడుతున్నాడు. ఆ ఆటగాడు ఎవరు? ఎందుకంత కసిగా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 22, 2024 | 7:52 PMUpdated Mar 22, 2024 | 7:53 PM
లైఫ్‌లో సర్వం కోల్పోయి.. కసిగా  IPLలోకి! ప్రతి జట్టుని భయపెడుతున్నాడు!

ధనాధన్‌ క్రికెట్‌కు పెట్టింది పేరైన ఐపీఎల్‌ సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో సీఎస్‌కే వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌తో ఈ మెగా టోర్ని ప్రారంభం కానుంది. అయితే.. ఈ టోర్నిలో చాలా మంది ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. వేలంలో కోట్ల ధర పలికిన ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌తో పాటు యువ ఆటగాళ్లు, అలాగే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోని లాంటి సూపర్‌ స్టార్‌ ప్లేయర్లపై అందరి కళ్లు ఉన్నాయి. వీళ్లంతా ఎలా ఆడతారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే.. ఓ ఆటగాడు మాత్రం నిశ్శబ్ధంగా అన్ని టీమ్స్‌ను భయపెడుతున్నాడు. లైఫ్‌లో ఎన్నో ఎదురుదెబ్బలు తిని, దాదాపు అన్నీ కోల్పోయి.. కసితో ఈ సారి ఐపీఎల్‌ బరిలోకి దిగుతున్నాడు. అలాంటి ఆటగాడ్ని అడ్డుకోవడం అంటే మండే అగ్ని గోళానికి ఎదురెళ్లడమే. మరి ఆ ఆటగాడు ఎవరు? ఎందుకంత డేంజరస్‌గా మారాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ జట్లకు కూడా ధావన్‌ ఆడాడు. ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ అంటే 2008 నుంచి ఆడుతున్న ధావన్‌.. ప్రతి ఏడాది మినిమమ్‌ గ్యారెంటీ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. ఫామ్‌తో సంబంధం లేకుండా యావరేజ్‌గా 400 పై చిలుకు రన్స్‌ చేస్తూ ఉంటాడు. ఇప్పటికే ధావన్‌ ఖాతాలో 6,617 ఐపీఎల్‌ రన్స్‌ ఉన్నాయి. ఇది సాధారణ నంబర్‌ కాదు. అయితే.. ప్రతి ఏడాది ధావన్‌ వేరు.. ఈ సారి బరిలోకి దిగబోతున్న శిఖర్‌ ధావన్‌ వేరు. ఇప్పుడు దిగబోతుంది గాయపడిన గబ్బర్‌. ఆ కసి మొత్తం ఈ సారి ఐపీఎల్‌లో చూపించబోతున్నాడు ధావన్‌.

లైఫ్‌లో చాలా కోల్పోయి..
కొన్నేళ్లుగా ధావన్‌ జీవితంలో ఊహించని దారుణాలు చాలా జరిగాయి. ఇద్దరు పిల్లలకు తల్లి అని తెలిసినా.. ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధావన్‌. కొన్నేళ్లు వారి జీవితం సజావుగానే సాగింది. కానీ, ఆస్థుల విషయంలో ధావన్‌తో గొడవకు దిగిన ఆమె.. విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకోవడమే కాకుండా.. తనకు ధావన్‌కు పుట్టిన పిల్లాడిని తండ్రికి దూరంగా పెంచింది. దాదాపు రెండేళ్ల పాటు ధావన్‌ను తన కుమారుడికి దూరంగా ఉంచి మానసిక వేదనుకు గురి చేసింది. దాని నుంచి బయటపడేందుకు ధావన్‌ తనలో తాను ఒక యుద్ధమే చేశాడు. తన బాధను పైకి కనిపించకుండా.. టీమిండియా కోసం తన వందశాతం ఎఫర్ట్‌ ఇస్తూ వచ్చాడు. కానీ కొన్ని నెలల క్రితం టీమిండియాలో కూడా చోటు కోల్పోయాడు ధావన్‌.

IPL teams scared of shikar dhawan

ఒక వైపు ప్రాణంలాంటి కొడుకు దూరమై మానసిక వేదన అనుభవిస్తున్న అతనికి టీమిండియాలో చోటు కోల్పోవడం మరింత బాధను ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో తన కొడుక్కి దూరంగా ఉంటూ తాను ఎలాంటి మానసిక వేదనను అనుభవిస్తున్నానో కూడా ధావన్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. విడాకుల సమయంలో చాలా ఆస్తులను కూడా కోల్పోయాడు. ఇలా ఆస్తులు పోయి, కొడుకు దూరమై, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఆస్తి కోసం వదిలిస్తే.. చివరికి ప్రాణం కంటే ఎక్కువైన క్రికెట్‌లో కూడా ఫామ్‌ కోల్పోయి టీమిండియాలో చోటు దక్కక ధావన్‌ జీవితం ఒక నరకంగా మారింది. ఇలాంటి టైమ్‌లో ప్రస్తుతం ఈ మానసిక వ్యథ నుంచి బయటపడేందుకు ధావన్‌ ముందు ఉన్న ఓకే ఒక ఆప్షన్‌ ఐపీఎల్‌.

అందుకే తనకు బాగా అచ్చొచ్చిన ఐపీఎల్‌లో సత్తా చాటి, తన జీవితంలో జరుగుతున్న దారుణాలను మర్చిపోయేందుకు ఈ సారి ఐపీఎల్‌లో మరింత కసిగా ఆడాలని ధావన్‌ ఫిక్స్‌ అయిపోయాడు. అందుకే ధావన్‌ పేరు చెబితేనే ప్రత్యర్థి జట్లు వణికిపోతున్నాయి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, తెగించినోడితో, కోల్పోవడానికి ఏమీ లేనోడితో పెట్టుకుంటే మాత్రం.. చాలా ప్రమాదం అని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు ధావన్‌ లాంటి ప్లేయర్‌కు బౌలింగ్‌ చేయాలంటే ఒక్కసారి బౌలర్లు  ఇప్పుడు చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. లైఫ్‌లో చాలా కోల్పోయి కసితో బరిలోకి దిగుతున్న ధావన్‌.. ఒక్క సారి కూడా కప్పు గెలవని పంజాబ్‌ కింగ్స్‌ను తన కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలపాలని కూడా పట్టుదలతో ఉన్నాడు. మరి ధావన్‌ ఈ ఐపీఎల్‌లో ఎలాంటి ప్రభావం చూపుతాడని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.