iDreamPost
android-app
ios-app

గబ్బర్ ఈజ్ బ్యాక్.. ఫోర్లు, సిక్స్ లతో మెరుపు బ్యాటింగ్!

  • Published Mar 07, 2024 | 6:33 PM Updated Updated Mar 07, 2024 | 6:33 PM

Shikhar Dhawan: డీవై పాటిల్ టీ20 కప్ 2024 టోర్నీలో దంచికొట్టాడు టీమిండియా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్. సీఏజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయి ఆడాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Shikhar Dhawan: డీవై పాటిల్ టీ20 కప్ 2024 టోర్నీలో దంచికొట్టాడు టీమిండియా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్. సీఏజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయి ఆడాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గబ్బర్ ఈజ్ బ్యాక్.. ఫోర్లు, సిక్స్ లతో మెరుపు బ్యాటింగ్!

శిఖర్ ధావన్.. టీమిండియా వెటరన్ ఓపెనర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. కానీ గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటు పూర్ ఫామ్ తో పాటుగా ఫ్యామిలీ ఇష్యూస్ తో సతమతమవుతున్నాడు. దీంతో జట్టుకు సెలెక్టర్లు అతడి వైపే చూడటం మానేశారు. అదీకాక ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లో సైతం చోటును కోల్పోయాడు ధావన్. ఈ రెండింటి కసిని తాజాగా జరుగుతున్న డీవై పాటిల్ టోర్నీలో చూపిస్తున్నాడు ఈ సీనియర్ బ్యాటర్. తాజాగా ఈ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలుంది. ఈ నేపథ్యంలో బ్యాటర్లు, బౌలర్లు తమదైన ఆటతీరుతో అదరగొడుతున్నారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా బ్యాటర్ శిఖర్ ధావన్ డీవై పాటిల్ టోర్నీలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అతడు డీవై పాటిల్ బ్లూ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా సీఏజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో చెలరేగాడు ఈ సీనియర్ బ్యాటర్. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన ధావన్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శతకానికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. రి ఎంట్రీ తర్వాత ధావన్ ఆటతీరులో చాలా మర్పు కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే ఐపీఎల్ కు ముందు ధావన్ ఫామ్ లోకి రావడంతో.. పంజాబ్ యాజమాన్యంతో పాటుగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధావన్ ఫామ్ లోకి రావడంతో.. ఐపీఎల్ లో ప్రత్యర్థి టీమ్స్ భయపడిపోతున్నాయి. అతడి మెరుపు బ్యాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలో బ్లూ టీమ్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అయితే టీమ్ లో మిగతా బ్యాటర్లు ఎవ్వరూ రాణించకపోవడంతో.. రెండొందలు దాటుతుందనుకున్న స్కోర్ తక్కువకే పరిమితమైంది. అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని సీఏజీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టులో వరుణ్ లవండే(70) అర్థసెంచరీతో రాణించాడు. సన్వీర్ సింగ్ (48*) దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో సీఏజీ సెమీఫైనల్ కు చేరుకుంది. మరి రి ఎంట్రీలో రెచ్చిపోయి ఆడుతున్న శిఖర్ ధావన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: ఇంగ్లండ్‌ కుర్రాడికి చుక్కలు చూపించిన జైస్వాల్‌!