రిటైర్మెంట్ ఇచ్చినా మళ్లీ బ్యాట్ పట్టి గ్రౌండ్​లోకి ధావన్.. ఏ టోర్నీలో అంటే?

Shikhar Dhawan Joins Legends League Cricket: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ అద్భుతమైన ఆటతీరుతో అలరించిన గబ్బర్.. ఇక బ్యాట్ పట్టడని తెలిసి అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. అయితే వాళ్లకో గుడ్ న్యూస్.

Shikhar Dhawan Joins Legends League Cricket: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ అద్భుతమైన ఆటతీరుతో అలరించిన గబ్బర్.. ఇక బ్యాట్ పట్టడని తెలిసి అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. అయితే వాళ్లకో గుడ్ న్యూస్.

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డొమెస్టిక్ క్రికెట్​తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు అనౌన్స్ చేశాడు. దేశానికి ఇన్నాళ్లూ ఆడినందుకు ఎంతో గర్వంగా ఉందని, ఈ జర్నీలో సహకరించిన ఫ్యామిలీ, కోచెస్, ఫ్యాన్స్​, బీసీసీఐకి అతడు కృతజ్ఞతలు తెలిపాడు. దేశానికి ఎంతో సేవలు అందించా, ఎంతో క్రికెట్ ఆడా అనే ఆనందంతో గేమ్​కు గుడ్​బై చెబుతున్నానని, హ్యాపీగా రిటైర్ అవుతున్నానని చెప్పాడు. ధావన్ రిటైర్మెంట్ వార్త తెలిసిన అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇన్నాళ్లూ అద్భుతమైన ఆటతీరుతో అలరించిన గబ్బర్.. ఇక బ్యాట్ పట్టడని తెలిసి వాళ్లు చాలా బాధపడ్డారు. అయితే అభిమానులకో గుడ్ న్యూస్. ధావన్ మళ్లీ బ్యాట్​తో మెరుపులు మెరిపించనున్నాడు. ఏ టోర్నీలో గబ్బర్ ఆడనున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

సెప్టెంబర్​లో జరిగే లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్​ఎల్​సీ)​తో మళ్లీ గ్రౌండ్​లోకి అడుగు పెట్టనున్నాడు ధావన్. అంతర్జాతీయ క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు ఆడే ఈ టోర్నీలో గబ్బర్ బ్యాట్​తో సందడి చేయనున్నాడు. భారత మాజీ ప్లేయర్లు రాబిన్ ఊతప్ప, హర్భజన్ సింగ్ లాంటి వాళ్లతో కలసి అతడు డ్రెస్సింగ్ రూమ్​ను పంచుకోనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ధావనే షేర్ చేశాడు. ‘ఇప్పటికి కూడా నాలో క్రికెట్ మిగిలే ఉంది. నేను ఇంకా క్రికెట్ ఆడగలను. నా జీవితంలో నుంచి తీసేయలేనిదిగా క్రికెట్ మారింది. అది నా నుంచి ఎప్పటికీ దూరమవదు. నా పాత క్రికెటింగ్ ఫ్రెండ్స్​తో మళ్లీ కలసి ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఫ్యాన్స్​ను ఎంటర్​టైన్ చేయాలని ఆతృతతో ఉన్నా. అభిమానులకు కొత్త జ్ఞాపకాలు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని ధావన్ చెప్పుకొచ్చాడు.

ధావన నుంచి గుడ్ న్యూస్ రావడంతో ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్​కు దిగుతూ బౌలర్లను చిత్తు చేసే గబ్బర్ ఆటను మళ్లీ చూసేందుకు రెడీ అవుతున్నారు. అతడిలో ఇంకా పస తగ్గేదని, లెజెండ్స్ లీగ్ క్రికెట్​లో రచ్చ చేస్తాడని అంటున్నారు. తీవ్ర ఒత్తిడి ఉన్నప్పుడే చెలరేగి ఆడే ధావన్.. రిటైర్ అయిపోయాడు, ఎలాంటి ప్రెజర్ లేదు కాబట్టి మరింత విధ్వంసం సృష్టిస్తాడని చెబుతున్నారు. ఇక, ధావన్ రిటైర్మెంట్ మీద టీమిండియా ప్రస్తుత ప్లేయర్లతో పాటు మాజీ క్రికెటర్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. భారత్ నుంచి వచ్చిన గ్రేటెస్ట్ ఓపెనర్స్​లో ధావన్ ఒకడని.. అతడు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చాడని కోహ్లీ అన్నాడు. ధావన్​ నిజమైన యోధుడని.. అతడి వల్ల తన పని ఎంతో ఈజీ అయిందన్నాడు రోహిత్. మరి.. లెజెండ్స్ లీగ్ క్రికెట్​లో గబ్బర్ గేమ్​ను చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments