iDreamPost
android-app
ios-app

నన్ను బ్లాక్ చేశారు.. నిన్ను చూసి ఏడాదవుతోంది.. కొడుకు గురించి ధావన్ భావోద్వేగ పోస్ట్

  • Published Dec 26, 2023 | 7:00 PM Updated Updated Dec 26, 2023 | 7:00 PM

భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన కొడుకు జొరావర్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు.

భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన కొడుకు జొరావర్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు.

  • Published Dec 26, 2023 | 7:00 PMUpdated Dec 26, 2023 | 7:00 PM
నన్ను బ్లాక్ చేశారు.. నిన్ను చూసి ఏడాదవుతోంది.. కొడుకు గురించి ధావన్ భావోద్వేగ పోస్ట్

టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. తను ప్రాణంగా ప్రేమించే కొడుకును తనకు దూరం చేయడంతో ఎంతో మాననసిక వేధనకు గురవుతున్నారు. తాజాగా తన కొడుకు బర్త్ డే సందర్భంగా శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తండ్రిగా కొడుకు జోరావర్ కు కనీసం పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పే అవకాశం లేకపోవడంతో మానసికంగా ఎంతో కృంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో జొరావర్ కు బర్త్ డే విషెస్ చెప్తూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. అది కాస్త నెట్టింటా వైరల్ గా మారింది.

నిన్ను నేను నేరుగా కలిసి ఏడాది అవుతోంది. కనీసం వీడియో కాల్ లోనైనా జోరావర్ తో మాట్లాడి మూడు నెలలు గడిచిపోయింది. నా నుంచి నిన్ను దూరం చేసేందుకు సోషల్ మీడియా అన్ని ప్లాట్ ఫాంలలో నన్ను బ్లాక్ చేశారు. అందుకే గతంలో నీతో వీడియో కాల్ మాట్లాడినప్పుడు తీసిన ఫొటోను పోస్ట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే మై బాయ్. నేను నేరుగా మాట్లాడకపోవచ్చు. కానీ టెలీపతితో ఎప్పటికీ నీకు దగ్గరగా ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావని, సంతోషంగా ఉంటావని ఆశిస్తున్నాను.

dhawan emotional his son

నీ విషయంలో నేను గర్వపడుతున్నాను. మీ నాన్న నిన్ను ఎప్పుడూ మిస్ అవుతుంటాడు. అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నీ నవ్వు చూస్తానని ఆశగా ఎదరుచూస్తుంటా. దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగి మళ్లీ మనం కలుస్తామని ఆశిస్తున్నాను. చిలిపిగా ఉండాలి, కానీ చెడువైపు వెళ్లవద్దు. ధైర్యంగా ఉంటూనే ఇతరుల పట్ల దయ, జాలి, సహనంతో వ్యవహరించాలి. నిన్ను నేను చూడకపోయినా.. నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తుంటావని ప్రతిరోజూ నీకోసం మెస్సేజ్‌లు రాస్తుంటా. నా క్షేమ సమాచారంతో పాటు జీవితంలో జరిగే మార్పుల గురించి ఎప్పటికప్పుడూ షేర్ చేస్తుంటాను లవ్ యూ జోరా అని తన కుమారుడు జోరావర్ బర్త్‌డే రోజు భావోద్వేగంతో ఇన్‌స్టాలో శిఖర్ ధావన్ పోస్ట్ చేశాడు.

ఇక అప్పటికే పెళై ఇద్దరు కూతుర్లున్న అయేషాను శిఖర్ ధావన్ 2012 లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయేషా, శిఖర్ ధావన్ లకు 2014లో జోరావర్ జన్మించాడు. ఆ తర్వాత వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న కలహాల వల్ల కొన్నాళ్లుగా విడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జోరావర్ ను ఆస్ట్రేలియాలో పెంచింది. ధావన్ తన కొడుకుతో మాట్లాడకుండా, కలవకుండా చేసి మానసిక వేదనకు గురిచేసింది అయేషా. కాగా ధావన్ తన భార్య అయేషా ముఖర్జీ నుంచి ఇటీవల విడాకులు పొందిన విషయం తెలిసిందే.

ఒక్కగానొక్క కొడుకుతో మాట్లాడనీయకుండా, కలవనీయకుండా చేయడంతో ధావన్ మానసికంగా కృంగిపోయాడు. తన భార్య మానసికంగా వేదించడంతో ఆమె పోరు పడలేక ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు ధావన్. దీనిపై విచారణ జరిపిన కోర్టు ధావన్ కు అనుకూలంగా తీర్పు వెల్లడించి విడాకులు మంజూరు చేసింది. అంతేగాక తన కొడుకును కలిసేందుకు, అతడితో వీడియో కాల్ మాట్లాడేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలోనే గతంలో ధావన్ తన కొడుకుతో వీడియో కాల్ మాట్లాడాడు. కానీ గత కొన్నినెలల నుంచి జోవర్ ను కలవకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అన్నింటిలో బ్లాక్ చేశారని వాపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

 

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş