శిఖర్ ధవన్.. నిన్న మొన్నటి వరకు భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా ఉండేవాడు. ఓపెనింగ్ పొజిషన్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. టీమ్‌లో అతడి ప్లేసుకు ఎలాంటి ఢోకా లేకుండా పోయేది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని మెయిన్ టీమ్ టోర్నీల్లో గానీ, కీలకమైన టూర్లకు వెళ్లినప్పుడు.. ధవన్‌కు మరో జట్టును అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌లో ధవన్ ఉండటం ఖాయమనే కామెంట్స్ వినిపించాయి. ఓపెనర్‌గా మంచి ఆరంభాలు ఇవ్వడంతో పాటు అవసరమైనప్పుడు నిదానం, దూకుడు.. ఇలా ఏదైనా పరిస్థితికి తగ్గట్లుగా ఆడతాడనే పేరు సంపాదించాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అతడు రాణించాడు. అయినా ఆసియా కప్ సహా వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ధవన్‌కు చోటు దక్కలేదు.
ఓపెనర్‌గా రోహిత్ శర్మకు తోడుగా శుబ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడుతుండటం, మిగిలిన అన్ని బ్యాటింగ్ పొజిషన్లు ఫిల్ అవడంతో ధవన్‌కు నిరాశ తప్పలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అతడు మళ్లీ భారత జట్టులోకి కమ్‌బ్యాక్ ఇవ్వడం కూడా కష్టమనే చెప్పాలి. 37 ఏళ్ల వయసు ఉన్న ధవన్ ఇక ఐపీఎల్‌కు పరిమితం అవుతాడేమోనని అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. ధవన్ విడాకుల కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు (ఫ్యామిలీ కోర్టు) కీలక తీర్పు ఇచ్చింది. భార్య అయేషా ముఖర్జీ నుంచి ధవన్‌కు విడాకులు మంజూరు చేసింది కోర్టు. అయేషాకు ధవన్ డివోర్స్ ఇచ్చేందుకు ఫ్యామిలీ కోర్టు యాక్సెప్ట్ చేసింది. విడాకుల పిటిషన్లో అయేషాపై ధవన్ చేసిన ఆరోపణలన్నింటినీ కోర్టు జడ్జి హరీష్ కుమార్ అంగీకరించారు.
ధవన్ భార్య అయేషా చేసిన ఆరోపణలను తాము వ్యతిరేకించలేదని.. తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో ఆమె విఫలమైనట్లు తీర్పు సందర్భంగా ఫ్యామిలీ కోర్టు పేర్కొంది. కాగా, భార్య అయేషా తనను మానసికంగా హింసిస్తోందని ధవన్ తన విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసులో దంపతుల కుమారుడి శాశ్వత కస్టడీపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది కోర్టు. తన కొడుకును కలుసుకోవడంతో పాటు అతడితో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడేందుకు ధవన్ హక్కును కోర్టు మంజూరు చేసింది. అలాగే అకడమిక్ క్యాలెండర్లో స్కూల్ సెలవుల్లో కనీసం సగం రోజులు ధవన్, అతడి కుటుంబ సభ్యులతో రాత్రిపూట బస చేయడంతో పాటు విజిటింగ్ కోసం పిల్లాడ్ని భారత్‌కు తీసుకురావాలని ధవన్ భార్య అయేషాను కోర్టు ఆదేశించింది. ధవన్-అయేషాలు 2012లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2014లో కుమారుడు పుట్టాడు. అతడికి జొరావర్ అనే పెట్టారు. 2021 నుంచి ధవన్-అయేషాలు దూరంగా ఉంటున్నారు.
ఇదీ చదవండి: గంభీర్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్న అశ్విన్!
Delhi Family Court has accepted all the allegations made by Shikhar Dhawan against his wife in his divorce petition. Dhawan’s wife failed to defend herself. pic.twitter.com/VDPHQISSjt
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2023