Nidhan
బీసీసీఐ ఆగ్రహానికి గురైన స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దయచేసి అతడ్ని విమర్శించొద్దని కోరాడు.
బీసీసీఐ ఆగ్రహానికి గురైన స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దయచేసి అతడ్ని విమర్శించొద్దని కోరాడు.
Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ బోర్డు ఆగ్రహానికి గురైన ఈ టాలెంటెడ్ ప్లేయర్.. తన కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. నేషనల్ డ్యూటీకి దూరంగా ఉన్న సమయంలో వెళ్లి డొమెస్టిక్ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ సూచించినా అతడు వినలేదు. గాయం సాకు చూపి రంజీల్లో ఆడకుండా ఎన్సీఏకు వెళ్లిపోయాడు అయ్యర్. దీంతో అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది బోర్డు. అయ్యర్‌తో పాటు డొమెస్టిక్‌లో ఆడాలనే తమ మాటల్ని బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్‌ను కూడా తొలగించింది. రంజీల్లో ఆడమంటే పట్టించుకోకుండా ఐపీఎల్‌కు ప్రిపేర్ అవడమే ఇషాన్ చేసిన తప్పు. ఈ వివాదంలో వీళ్లిద్దరికీ కొందరు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు బోర్డు చేసిందే కరెక్ట్ అన్నారు. అయితే భారత పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం అయ్యర్‌కు అండగా నిలిచాడు.
శ్రేయస్ అయ్యర్‌ను ఎవరూ విమర్శించొద్దని శార్దూల్ ఠాకూర్ కోరాడు. అయితే ఇది బోర్డు కాంట్రాక్ట్ గురించి కాదు.. బ్యాటింగ్ ఫెయిల్యూర్ విషయంలో అతడికి అండగా నిలిచాడు శార్దూల్. రంజీ ట్రోఫీ-2024 ఫైనల్లో అయ్యర్ విఫలమయ్యాడు. విదర్భతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్.. 7 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. సీనియర్ బ్యాటర్, ముంబై కెప్టెన్ అజింక్యా రహానె కూడా 7 పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో వీళ్లపై విమర్శలు మొదలయ్యాయి. ఇంత అనుభవం ఉన్న ప్లేయర్లు అయి ఉండి, ఫైనల్ మ్యాచ్‌లో ఫెయిల్ అవడం ఏంటంటూ అభిమానులు సీరియస్ అయ్యారు. దీంతో ఈ విషయంపై శార్దూల్ రియాక్ట్ అయ్యాడు. దయచేసి అయ్యర్, రహానేను విమర్శించొద్దని కోరాడు. ఇది వాళ్లకు కష్టమైన సమయమని.. అండగా నిలవాలని ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేశాడు.
‘రహానె ఈ సీజన్లో పెద్దగా పరుగులు చేయలేదు. అతడు ఫామ్‌లో లేడు. అతడి బ్యాట్ నుంచి ఆశించినంతగా పరుగులు రావడం లేదు. అయితే అతడ్ని నిందించడం కరెక్ట్ కాదు. రహానేతో పాటు అయ్యర్‌కు ఇది క్లిష్టమైన సమయం. వాళ్లిద్దరూ ముంబైతో పాటు టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో విజయాలు అందించారు. వాళ్లు మ్యాచ్ విన్నర్స్. ఇప్పుడు వాళ్ల టైమ్ బాగోలేదు. కాబట్టి అయ్యర్, రహానేను విమర్శించే బదులు సపోర్ట్ చేయాలి. క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ. కానీ అండగా నిలవడం కష్టం. ఇప్పుడు అదే పని చేయాలి’ అని శార్దూల్ చెప్పుకొచ్చాడు. కాగా, రంజీ ఫైనల్లో మొదటి ఇన్నింగ్స్‌లో శార్దూల్ అదరగొట్టాడు. 154 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను ఆదుకున్నాడు. 75 రన్స్ చేసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. మరి.. అయ్యర్, రహానేను విమర్శించొద్దు అంటూ శార్దూల్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shardul Thakur defends Shreyas Iyer and Ajinkya Rahane, urging fans to show support during their rough patch#ShardulThakur #ShreyasIyer #AjinkyaRahane #Insidesport #CricketTwitter pic.twitter.com/xKBjyMZqEy
— InsideSport (@InsideSportIND) March 11, 2024