iDreamPost
android-app
ios-app

Shamar Joseph: ఆసీస్ ను వణికించిన ఒకే ఒక్కడు.. బంతులు కాదు, బుల్లెట్లు!

  • Published Jan 28, 2024 | 4:01 PM Updated Updated Jan 28, 2024 | 4:01 PM

ఆసీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో ఏకంగా 8 వికెట్లతో ఆసీస్ నడ్డివిరిచి.. సిరీస్ ను 1-1తో డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు షమర్ జోసెఫ్. బంతులను బుల్లెట్లలా విసురుతూ.. కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

ఆసీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో ఏకంగా 8 వికెట్లతో ఆసీస్ నడ్డివిరిచి.. సిరీస్ ను 1-1తో డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు షమర్ జోసెఫ్. బంతులను బుల్లెట్లలా విసురుతూ.. కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

Shamar Joseph: ఆసీస్ ను వణికించిన ఒకే ఒక్కడు.. బంతులు కాదు, బుల్లెట్లు!

షమర్ జోసెఫ్.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ క్రికెట్ లో ఓ సంచలనం. వెస్టిండీస్ కు చెందిన ఈ యంగ్ పేసర్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ తోనే తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. ఇక ఆసీస్ తో జరిగిన తొలి టెస్ట్ లోనే 5 వికెట్లు పడగొట్టి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన పదునైన పేస్ తో కంగారూ బ్యాటర్ల పాలిట శత్రువుగా మారాడు. తొలి మ్యాచ్ లో ఓడిపోయిన వెస్టిండీస్ రెండో మ్యాచ్ లో గొప్పగా పుంజుకుంది. షమర్ జోసెఫ్ మరోసారి రెచ్చిపోయాడు. తాజాగా జరిగిన రెండో టెస్ట్ లో ఏకంగా 8 వికెట్లతో ఆసీస్ నడ్డివిరిచి.. సిరీస్ ను 1-1తో డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఎవరీ జోసెఫ్ అంటూ వెతకడం ప్రారంభించారు నెటిజన్లు.

1999 ఆగస్టు 31న వెస్టిండీస్ లో జన్మించాడు షమర్ జోసెఫ్. చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం పెంచుకున్న షమర్ కు ఆర్థిక కష్టాలు ఆదిలోనే బ్రేక్ వేశాయి. దీంతో సెక్యూరిటీ గార్డ్ గా పని చేసి కుటుంబానికి అండగా నిలబడ్డాడు. అయితే తన డ్రీమ్ ను మాత్రం వదులుకోలేదు. అలాగే ప్రాక్టీస్ చేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగి వెస్టిండీస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. సంవత్సరం తిరక్క ముందే.. జాతీయ జట్టులోకి రంగప్రవేశం చేశాడు. కొన్ని రోజులు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నెట్ బౌలర్ గా ఉన్నాడు జోసెఫ్. ఇక అతడి బౌలింగ్ సెలెక్టర్ల దృష్టిలో పడటంతో అతి తక్కువ కాలంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఏకంగా ఆసీస్ సిరీస్ కే జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

shamar joseph superb bowling

కంగారూ టీమ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఓవల్ లో జరిగిన తొలి మ్యాచ్ తో డెబ్యూ చేశాడు ఈ యంగ్ బౌలర్. ఇక తన కెరీర్ ను తొలి బంతితోనే అద్భుతంగా రాణించాడు. తొలి బంతికే స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను ఔట్ చేసి.. షాకిచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీసి సరికొత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. కాగా.. రెండో మ్యాచ్ లో కూడా నిప్పులు చెరిగే బౌలింగ్ లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసిన షమర్.. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. బుల్లెట్ల కంటే వేగంగా బంతులు విసురుతూ.. కంగారూ ఆటగాళ్లను కంగారు పెట్టాడు. షమర్ జోసెఫ్ ధాటికి 215 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది ఆసీస్.

ఇక ఆసీస్ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ ఒక్కడే 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయినా టీమ్ కు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ప్రమాదకరంగా మారుతున్న కామెరూన్ గ్రీన్(42) ను బౌల్డ్ చేసిన షమర్.. ఆ తర్వాత బంతికే స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్(0)ను కూడా బౌల్డ్ చేశాడు. ఇక అప్పటి నుంచి వెంటవెంటనే వికెట్లను కూల్చుతూ.. విండీస్ విజయానికి బాటలు వేశాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులను సంధిస్తూ.. మ్యాచ్ ను ఆసీస్ నుంచి లాగేసుకున్నాడు. ఎంతో అనుభవం ఉన్న ఆసీస్ ఆటగాళ్లు ఈ కుర్ర బౌలర్ ముందు నిలవలేకపోయారు. దీంతో 27 సంవత్సరాల చరిత్రను తిరగరాసింది వెస్టిండీస్. 1997 తర్వాత ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆసీస్ గడ్డపై ఈ విజయానికి ముందు గెలవలేదు విండీస్ టీమ్. మరి కంగారూ టీమ్ ను కంగారు పెట్టించిన విండీస్ నయా సంచలనం షమర్ జోసెఫ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.