iDreamPost
android-app
ios-app

లక్నో చేతిలో చిరుతలాంటి బౌలర్‌! ఆస్ట్రేలియాను మడతబెట్టి వస్తున్నాడు..

  • Published Mar 21, 2024 | 4:40 PMUpdated Mar 21, 2024 | 4:40 PM

Shamar Joseph, Lucknow Super Giants, IPL 2024: క్రికెట్‌ అభిమానులకు పండుగ లాంటి ఐపీఎల్‌ సీజన్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్‌లో 9 టీమ్స్‌ను భయపెడుతున్న ఓ బౌలర్‌ లక్నో టీమ్‌లో ఉన్నాడు. ఆ బౌలర్‌ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

Shamar Joseph, Lucknow Super Giants, IPL 2024: క్రికెట్‌ అభిమానులకు పండుగ లాంటి ఐపీఎల్‌ సీజన్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్‌లో 9 టీమ్స్‌ను భయపెడుతున్న ఓ బౌలర్‌ లక్నో టీమ్‌లో ఉన్నాడు. ఆ బౌలర్‌ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 21, 2024 | 4:40 PMUpdated Mar 21, 2024 | 4:40 PM
లక్నో చేతిలో చిరుతలాంటి బౌలర్‌! ఆస్ట్రేలియాను మడతబెట్టి వస్తున్నాడు..

ఐపీఎల్‌ 2024 సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్ని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా సీఎస్‌కే వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌ ఐపీఎల్‌ సమరం షురూ కానుంది. క్రికెట్‌ అభిమానులు సైతం ఎప్పటిలాగే ఈ ఏడాది సీజన్‌ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌లో చాలా మండి యంగ్‌ ప్లేయర్లు పాల్గొంటున్నారు. కోహ్లీ, ధోని, రోహిత్‌, మ్యాక్స్‌వెల్‌ లాంటి స్టార్లు ఉన్నప్పటికీ.. యంగ్‌ ప్లేయర్ల గురించే అన్ని టీమ్స్‌ ఆలోచిస్తున్నాయి. తమ టీమ్‌లో ఉన్న యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్లను ఎలా పదును పెట్టి వాడుకోవాలని ప్లాన్స్‌ వేస్తూనే.. మరోవైపు ప్రత్యర్థి జట్లలోని మెరికల్లాంటి ఆటగాళ్లను ఎలా కట్టడి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే.. లక్నోలో ఉన్న ఓ కుర్ర బౌలర్‌ మిగిలిన 9 ఐపీఎల్‌ టీమ్స్‌ని భయపెడుతున్నాడు. వామ్మో ఈ బౌలర్‌ లక్నో టీమ్‌లో ఉన్నాడా అంటూ క్రికెట్‌ అభిమానులతో పాటు ప్రత్యర్థి టీమ్స్‌ కూడా భయపడుతున్నాయి. మరి ఆ బౌలర్‌ ఎవరు? ఎలాంటి బౌలింగ్‌ వేస్తాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

లక్నో సూపర్‌ జెయింట్స్‌.. 2022 ఐపీఎల్‌ సీజన్‌తో ఎంట్రీ ఇచ్చిన జట్టు. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహల్‌ ఆ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. లక్నో టీమ్‌కు ఇంకా పెద్దగా స్టార్‌డమ్‌ రాలేదు. పైగా టైటిల్‌ ఫేవరేట్‌గా కూడా ఎవరు భావించడం లేదు. కానీ, ఆ టీమ్‌లో ఉన్న ఓ బౌలర్‌ను చూసి మాత్రం అంతా భయపడుతున్నారు. ఆ బౌలర్‌ ఎవరంటే.. వెస్టిండీస్‌కు చెందిన షమర్‌ జోసెఫ్‌. 24 ఏళ్ల ఈ కుర్రాడి పేరు.. ఓ రెండు నెలల క్రితం అంటే జనవరి నెలలో ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోయింది. అప్పటికే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 గెలిచి మంచి జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా లాంటి టీమ్‌ను ఈ కుర్రాడు వణికించాడు. అది కూడా కంగారుల సొంత గడ్డ గబ్బాలో. ఆసీస్‌ బ్యాటర్లను అతను వణికించిన తీరు చూసి.. ప్రపంచ క్రికెట్‌ షాక్‌ అయింది.

IPL teams scared of shamer joseph

పని అయిపోయింది అనుకున్న వెస్టిండీస్‌ జట్టు నుంచి ఇలాంటి బౌలర్‌ పుట్టుకు రావడంతో ఒక్కసారిగా అందరు పాత వెస్టిండీస్‌ను తల్చుకున్నారు. జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షమర్‌ జోసెఫ్‌.. తొలి సిరీస్‌లోనే విధ్వంసం సృష్టించాడు. తొలి మ్యాచ్‌ ఓడిపోయిన వెస్టిండీస్‌.. రెండో మ్యాచ్‌లో ఒంటిచేత్తో గెలిపించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో పాటు పోరాడే బ్యాటింగ్‌తో గబ్బా లాంటి ప్రతిష్టాత్మక వేదికపై ఆసీస్‌ను ఓడించాడు. రెండో టెస్ట్ లో ఏకంగా 8 వికెట్లతో ఆసీస్ నడ్డివిరిచి.. సిరీస్ ను 1-1తో డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఎవరీ జోసెఫ్ అంటూ క్రికెట్‌ ప్రపంచం మొత్తం అతనివైపు చూసింది. 1999 ఆగస్టు 31న వెస్టిండీస్‌లో జన్మించిన షమర్ జోసెఫ్.. సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసి కుటుంబానికి అండగా నిలబడ్డాడు.

అయితే క్రికెట్‌ కావాలనే తన కలను నిజం చేసుకునేందుకు.. క్రికెట్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టి, నిప్పులు చిమ్మే తన బౌలింగ్‌కు పదునుపెట్టి.. వెస్టిండీస్‌ జట్టులో చోటు సాధించాడు. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుని.. చాలా ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్‌ టెస్ట్‌ మ్యాచ్‌ విజయాన్ని అందించాడు. అతనిలోని ఫైర్‌ను గుర్తించిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం వెంటనే అతనితో ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్‌ 2024 కోసం అతన్ని టీమ్‌లోకి తీసుకొచ్చింది. అతను బరిలోకి దిగి బుల్లెట్‌ లాంటి తన బంతులను సంధిస్తే.. ప్రత్యర్థి టీమ్‌లోని బ్యాటర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఆసీస్‌పై వెస్టిండీస్‌ను ఒంటిచేత్తో గెలిపించినట్లే.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఈ సారి ఛాంపియన్‌గా నిలుపుతాడేమో అని లక్నో అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి సెక్యూరిటీ గార్డ్‌ నుంచి నిప్పులు చెరిగే బౌలర్‌గా మారి.. ఇప్పుడు ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్న షమర్‌ జోసెఫ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి