SNP
Shamar Joseph, AUS vs WI: ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు 27 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. పైగా గబ్బా లాంటి ప్రతిష్టాత్మక వేదికగాపై అద్భుత విజయం సాధించింది. అ విజయంలో కీలక పాత్ర పోషించిన షమర్ జోసెఫ్.. గాయపడిన సింహంలా చెలరేగాడు. ఆసీస్ కుట్రను ఛేదించాడు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Shamar Joseph, AUS vs WI: ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు 27 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. పైగా గబ్బా లాంటి ప్రతిష్టాత్మక వేదికగాపై అద్భుత విజయం సాధించింది. అ విజయంలో కీలక పాత్ర పోషించిన షమర్ జోసెఫ్.. గాయపడిన సింహంలా చెలరేగాడు. ఆసీస్ కుట్రను ఛేదించాడు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఈ సినిమా డైలాగ్.. వెస్టిండీస్ స్పీడ్‌స్టర్ షమర్ ఓసెఫ్‌కు సరిగ్గా సరిపోతుంది. అతనిపై ఆసీస్ చేసిన కుట్రకు అతను బదులిచ్చిన విధానం అద్భుతం. గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించి.. వెస్టిండీస్ యువ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధించిన కరేబియన్ టీమ్.. తిరిగి పునర్‌వైభవాన్ని అందుకోవడానికి తొలి అడుగు వేసింది. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు 8 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ విజయంతో వెస్టిండీస్ స్పీడ్‌స్టర్ షమర్ జోసెఫ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 216 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పటిష్టమైన ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించి.. ఏకంగా 7 వికెట్లతో చెలరేగి.. వెస్టిండీస్‌కు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. అయితే.. ఈ అద్భుత ప్రదర్శనకు ముందు ఆస్ట్రేలియా అతనిపై చేసిన కుట్రపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆసీస్ తన నీచబుద్ధిని చూపించినా.. గాయపడిన సింహంలా షమర్ తన విశ్వరూపం చూపించాడని అంటున్నారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి.. 311 పరుగుల మంచి స్కోర్ చేసింది. అలాగే ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ను 193 పరుగులకే కట్టడి చేసింది ఆసీస్. కాగా, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. నిజానికి రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ కేవలం 9 వికెట్లు మాత్రమే కోల్పోయింది. చివర్లో షమర్ జోసెఫ్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ అవ్వడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక్కడే ఆస్ట్రేలియా తప్పు చేసిందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆసీస్ కావాలని చేసిందా లేదా అన్నది పక్కనపెడితే.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఇది కచ్చితంగా ఆసీస్ కుట్రే అంటున్నారు.
ఇంతకీ ఆసీస్ ఏం చేసిందంటే.. షమర్ జోసెఫ్ విండీస్‌లో కీలక బౌలర్. అలాంటి బౌలర్‌ను గాయపరిస్తే.. తర్వాత బౌలింగ్‌కు దిగడనే కుట్రతో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్.. నో బాల్ వేసి మరీ షమర్ కాళ్లను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ ఘటన.. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 73వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఆ ఓవర్ నాలుగో బంతిని ఆడటంతో వెస్టిండీస్ బ్యాటర్ షమర్ జోసెఫ్ విఫలం అయ్యాడు. దాంతో ఆ డెడ్లీ యార్కర్ నేరుగా వెళ్లి కుడి కాలి బొటన వేలిపై తాకింది. బాల డైరెక్ట్‌గా తాకడంతో జోసెఫ్ కాలికి తీవ్ర గాయమైంది. ఆ నొప్పితో అతను అల్లాడి పోయాడు. ఆస్ట్రేలియా దానికి కూడా అపీల్ చేయడంతో.. అంపైర్ లెగ్ బిఫోర్‌గా అవుట్ ఇచ్చాడు. కానీ, రీప్లేలో స్టార్క్ లైన్‌ను క్రాస్ చేసి ఓవర్ స్టెప్ వేయడంతో దాన్ని నో బాల్‌గా పరిగణించారు. దీంతో జోసెఫ్ నాటౌట్‌గా నిలిచాడు.
నో బాల్ కారణంగా లెగ్ బిఫోర్ అవుట్ నుంచి బతికిపోయినా.. బాల్ తగిలిన నొప్పిని మాత్రం తట్టుకోలేకపోయాడు జోసెఫ్. కాలి వేళ్లకు గాయం కావడంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా గ్రౌండ్ వీడాల్సి వచ్చింది. అదే చివరి వికెట్ కావడంతో.. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ 193 పరుగుల వద్ద ముగిసింది. అంత తీవ్ర గాయమైనా కూడా తిరిగి గ్రౌండ్‌లోకి దిగిన షమర్ జోసెఫ్.. ఆసీస్‌కు ఊహించని షాకిచ్చాడు. గాయపడిన సింహంలా ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను చిందరవందర చేశాడు. షమర్ చిప్పులు చెరుగుతుంటే.. తట్టుకోవడం వారి తరం కాలేదు. దీంతో.. కేవలం 216 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేయలేక ఆసీస్ చేతులెత్తేసింది. బొటనవేలు చిద్రమైనా.. బౌలింగ్‌లో దుమ్మురేపి.. వెస్టిండీస్‌కు చారిత్రాత్మక విజయం అందించాడు షమర్ జోసెఫ్. ఈ మ్యాచ్‌లో ట్రూ ఛాంపియన్‌లా ఆడి.. 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై వెస్టిండీస్‌ను గెలిపించాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Every angle, every call – how the broadcasters celebrated Shamar Joseph and the West Indies’ historic Gabba win #AUSvWI pic.twitter.com/zainOcQ79C
— cricket.com.au (@cricketcomau) January 28, 2024
West Indies’ Shamar Joseph got hurt by Mitchell Starc’s searing toe-crusher and retired hurt.
Hope it is not a serious injury.
📸: @cricketcomau pic.twitter.com/ZT3cAfbJHB
— CricTracker (@Cricketracker) January 27, 2024