వరల్డ్ కప్ ముంగిట బంగ్లాదేశ్ క్రికెట్ లో అలజడి సృష్టించాడు ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్. వరల్డ్ కప్ జట్టులోకి ఆ సీనియర్ ఆటగాడిని తీసుకుంటే.. నేను కెప్టెన్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా వరల్డ్ కప్ కూడా ఆడను అంటూ బంగ్లా క్రికెట్ బోర్డుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడంట షకీబ్. దీంతో ప్రపంచ కప్ ముందు బంగ్లా టీమ్ లో లుకలుకలు బయటపడ్డాయి. మరి ఇంతకీ షకీబ్ జట్టులో వద్దూ అంటున్న ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఆ జట్టు సారథి షకీబ్ అల్ హసన్. వరల్డ్ కప్ జట్టులో సీనియర్ ఆటగాడు అయిన తమీమ్ ఇక్బాల్ ఉంటే తాను కెప్టెన్ గా రాజీనామా చేయడమే కాకుండా వరల్డ్ కప్ కూడా ఆడనని తెగేసి చెప్పాడట షకీబ్ అల్ హసన్. ప్రపంచ కప్ కు ఇక్బాల్ ను ఎంపిక చేస్తారని జరుగుతున్న ప్రచారం పట్ల షకీబ్ అసంతృప్తితో ఉన్నట్లు సొమెుయ్ టీవీ తెలిపింది. కాగా.. తాను వరల్డ్ కప్ లో 5 మ్యాచ్ లకు అందుబాటులో ఉండనని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సమాచారం ఇచ్చాడు తమీమ్ ఇక్బాల్. దీంతో అతడు ఇంకా పూర్తి ఫిట్ నెస్ లోకి రాలేదని తెలుస్తోంది. ఇది దృష్టిలో పెట్టుకునే షకీబ్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఇదే విషయమై సోమవారం రాత్రి బీసీబీ చైర్మన్ ను షకీబ్ కలిశాడని బంగ్లా టైగర్స్ అండ్ రంగాపూర్ రైడర్స్ సోషల్ మీడియా మేనేజర్ సైఫ్ అహ్మద్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. పూర్తి ఫిట్ నెస్ లో లేని తమీమ్ కు బదులుగా ఇంకో ఆటగాడిని తీసుకోవాలని షకీబ్ భావిస్తున్నాడట. కాగా.. గాయం కారణంగా ఆసియా కప్ కు దూరం అయిన ఇక్బాల్.. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ద్వారా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. షకీబ్ నిర్ణయంతో బంగ్లా క్రికెట్ బోర్డ్ ఇరకాటంలో పడినట్లు అయ్యింది. అయితే దీనిపై బోర్డ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి షకీబ్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.