iDreamPost

వరల్డ్ కప్ ముంగిట రోహిత్ కీలక వ్యాఖ్యలు.. మేం వాటిని పట్టించుకోం అంటూ..!

  • Author Soma Sekhar Published - 07:28 PM, Tue - 26 September 23
  • Author Soma Sekhar Published - 07:28 PM, Tue - 26 September 23
వరల్డ్ కప్ ముంగిట రోహిత్ కీలక వ్యాఖ్యలు.. మేం వాటిని పట్టించుకోం అంటూ..!

మరికొన్ని రోజుల్లో ప్రపంచ కప్ జాతర ప్రారంభం కానుంది. ఇక ఈ మెగా ఈవెంట్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకిగి దిగుతోంది టీమిండియా. ప్రస్తుతం భీకరఫామ్ లో ఉంది భారత జట్టు. ఇప్పటికే ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని ఫుల్ జోష్ లో ఉంది భారత టీమ్. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వరల్డ్ కప్ ముందు టీమిండియా సారథి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకుని, మూడో వన్డే కోసం జట్టుతో కలిశాడు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం రోహిత్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ కప్ ముంగిట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే కామెంట్స్ ఎవరికైనా కౌంటర్ గా చేశాడా? లేక ఇంకేదైనా ఉద్దేశంతో చేశాడా? అన్న సందేహం అభిమానుల్లో కలుగుతోంది.

ఇంతకీ రోహిత్ ఏం మాట్లాడాడు అంటే? వరల్డ్ కప్ లో బ్యాటర్లు 2 సెంచరీలు చేశారా? లేక ఒక సెంచరీ చేశాడా? అస్సలే శతకం కొట్టలేదా? అన్నది మ్యాటర్ కాదు.. మా ఏకైక లక్ష్యం వరల్డ్ కప్ గెలవడమే అని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. టీమ్ సమష్టిగా రాణిస్తుందని, ఇప్పుడు మాకు ఇదే కావాలన్న ఉద్దేశంతోనే రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు వ్యక్తిగత రికార్డుల కొరకు ఆలోచించే ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకునే అన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇండియాలో ఇలా వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించే ప్లేయర్లు లేరని ఇంకొందరు ధీటుగా బదులిచ్చారు. మరి రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి