iDreamPost
android-app
ios-app

WI vs USA: విధ్వంసం సృష్టించిన విండీస్‌ ఓపెనర్‌! బిత్తరపోయిన అమెరికా

  • Published Jun 22, 2024 | 11:15 AM Updated Updated Jun 22, 2024 | 11:15 AM

Shai Hope, WI vs USA, T20 World Cup 2024: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఓపెనర్‌ విధ్వంసం సృష్టించాడు. అతని బ్యాటింగ్‌ చూసి.. పసికూన అమెరికా బిత్తరపోయింది. ఆ ఇన్నింగ్స్‌ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

Shai Hope, WI vs USA, T20 World Cup 2024: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఓపెనర్‌ విధ్వంసం సృష్టించాడు. అతని బ్యాటింగ్‌ చూసి.. పసికూన అమెరికా బిత్తరపోయింది. ఆ ఇన్నింగ్స్‌ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 22, 2024 | 11:15 AMUpdated Jun 22, 2024 | 11:15 AM
WI vs USA: విధ్వంసం సృష్టించిన విండీస్‌ ఓపెనర్‌! బిత్తరపోయిన అమెరికా

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. సూపర్‌ 8లో జరిగిన ఈ మ్యాచ్‌లో పసికూన యూఎస్‌ఏపై విండీస్‌ వీరులు తమ ప్రతాపం చూపించారు. వారి దెబ్బకు అమెరికా బౌలర్లు బిత్తరపోయారనే చెప్పాలి. ముఖ్యంగా వెస్టిండీస్‌ ఓపెనర్‌ షై హోప్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ చూసి.. వామ్మో ఇదేం కొట్టుడు స్వామి అని యూఎస్‌ఏ ప్లేయర్లు అనుకుని ఉంటారు. ఎందుకంటే.. అతని విధ్వంసం ఆ రేంజ్‌లో సాగింది. 129 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు.. కేవలం 11 ఓవర్లలోనే విజయం అందించాడు.

తొలి బంతి నుంచే యూఎస్‌ఏ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 39 బంతుల్లో 4 ఫోర్లు, 8 భారీ సిక్సులతో 82 పరుగులు చేసి.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించి.. వెస్టిండీస్‌కు ఎంతో కీలకమైన రన్‌రేట్‌ను కూడా అందించాడు షై హోప్‌. సూపర్‌ 8 నుంచి సెమీ ఫైనల్‌కు వెళ్లాలంటే కచ్చితంగా భారీ తేడాతో నెగ్గాల్సిన వెస్టిండీస్‌ అదే రేంజ్‌లో ఆడి గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ 19.5 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ జట్టులో ఏ బ్యాటర్‌ కూడా 30 పరుగుల మార్క్‌ను అందుకోలేదు. ఆండ్రీస్ గౌస్ ఒక్కడే 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 29 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఎన్‌ఆర్‌ కుమార్‌ 20, మిలింద్‌ కుమార్‌ 19 పరుగులు చేశారు.

వెస్టిండీస్‌ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్‌ 3, రోస్టన్‌ ఛేస్‌ 3 వికెట్లతో యూఎస్‌ఏ పనిపట్టారు. అల్జారీ జోసెఫ్‌ 2 వికెట్లతో రాణించాడు. ఇక 129 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. టార్గెట్‌ను ఊదిపారేసింది. కేవలం 10.5 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ షై హోప్‌ 39 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సులతో 82 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్‌ జాన్సన్‌ ఛార్లెస్‌ 15, నికోలస్‌ పూరన్‌ 12 బంతుల్లో ఒక ఫోర్ల్‌, 3 సిక్సులతో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి.. హోప్‌తో కలిసి మ్యాచ్‌ను ముగించాడు. మరి ఈ మ్యాచ్‌లో పసికూన అమెరికాపై షై హోప్‌ విధ్వంసం సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.