ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో అజేయ శతకంతో విండీస్ జట్టును గెలిపించాడు కెప్టెన్ షై హోప్. అయితే తన అద్బుత ఇన్నింగ్స్ కు కారణం ధోని అని తేల్చి చెప్పాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో అజేయ శతకంతో విండీస్ జట్టును గెలిపించాడు కెప్టెన్ షై హోప్. అయితే తన అద్బుత ఇన్నింగ్స్ కు కారణం ధోని అని తేల్చి చెప్పాడు.
వరల్డ్ కప్ 2023లో దారుణంగా విఫలమైన ఇంగ్లాండ్ జట్టు తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో ఆతిథ్య వెస్టిండీస్ బోణీ కొట్టింది. ఇరు జట్ల మధ్య జరిగిన వన్డేలో ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది విండీస్ టీమ్. ఈ మ్యాచ్ లో అజేయ శతకంతో అదరగొట్టాడు విండీస్ కెప్టెన్ షై హోప్. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, దిగ్గజం వీవీ రిచర్డ్స్ సరసన చేరాడు. ఇదిలా ఉండగా తన అద్భుత ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రెడిట్ ఇచ్చాడు. ధోని ఇచ్చిన సలహాల వల్లే నేను ఇలా ఆడగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు విండీస్ కెప్టెన్. మరి ధోని అతడికి ఇచ్చిన సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అద్భుత శతకంతో చెలరేగాడు విండీస్ సారథి షై హోప్. కేవలం 83 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రిచర్డ్స్ లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించాడు షై హోప్. ఇదిలా ఉండగా.. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ.. ఇదంతా ధోని సలహాల వల్లే సాధ్యం అయ్యిందని పేర్కొన్నాడు హోప్.
“మేము మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. ఇక నా సెంచరీ టీమ్ విజయానికి కారణమైనందుకు సంతోషం. అయితే నేను ఇలా రాణించడానికి రీజన్ ఎంఎస్ ధోని. కొన్నాళ్ల క్రితం నేను ధోనితో మాట్లాడాను. అనుకున్న సమయం కంటే ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండేందుకు ప్రయత్నించమని, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్ కాపాడుకోవడం ముఖ్యమని నాకు చెప్పాడు. నేను ఇప్పుడు అదే పాటించాను. ఈ ఇన్నింగ్స్ క్రెడిట్ మెుత్తం ధోనికే” అంటూ చెప్పుకొచ్చాడు విండీస్ కెప్టెన్ షై హోప్. నెక్ట్స్ మ్యాచ్ లోనూ ఇదే ఫలితాన్ని రాబడతామని తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో హ్యారీ బ్రూక్(71), జాక్ క్రార్వ్లే(48), సాల్ట్(45) పరుగులతో రాణించారు. అనంతరం 326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 48.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ షై హోప్(109*) అజేయ శతకానికి తోడు.. అతనాజే(66), షెపర్డ్(49) రాణించడంతో విజయం సాధించింది. మరి అద్భుత ఇన్నింగ్స్ కు ధోని సలహాలే కారణం అని చెప్పుకొచ్చిన విండీస్ కెప్టెన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shai Hope talking about the advice of MS Dhoni which helped him.
– Thala, an icon!pic.twitter.com/MbMGGaikzp
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 4, 2023