iDreamPost
android-app
ios-app

ఆ క్రికెటర్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోవాలని కోరిన షారుఖ్‌ ఖాన్‌!

  • Published Apr 30, 2024 | 11:49 AM Updated Updated Apr 30, 2024 | 11:49 AM

Shahrukh Khan, Rinku Singh: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ప్రకటించిన టీమ్‌లో ఆ క్రికెటర్‌ పేరు ఉండాలని బాలీవుడ్‌ హీరో, కేకేఆర్‌ ఓనర్‌ షారుఖ్‌ ఖాన్‌ కోరాడు. ఇంతకీ షారుఖ్‌ ఎవరి పేరు చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

Shahrukh Khan, Rinku Singh: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ప్రకటించిన టీమ్‌లో ఆ క్రికెటర్‌ పేరు ఉండాలని బాలీవుడ్‌ హీరో, కేకేఆర్‌ ఓనర్‌ షారుఖ్‌ ఖాన్‌ కోరాడు. ఇంతకీ షారుఖ్‌ ఎవరి పేరు చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 30, 2024 | 11:49 AMUpdated Apr 30, 2024 | 11:49 AM
ఆ క్రికెటర్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోవాలని కోరిన షారుఖ్‌ ఖాన్‌!

ప్రస్తుతం ఇండియా ఐపీఎల్‌ ఫీవర్‌తో ఊగిపోతోంది. అన్ని మ్యాచ్‌లు క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ వినోదాన్ని అందిస్తూ.. హోరాహోరీగా సాగుతున్నాయి. భారీ భారీ రికార్డులు బద్దలు అవుతున్నాయి. బ్యాటర్లు మెరుపువేగంతో బ్యాటింగ్‌ చేస్తూ.. కలలో కూడా ఊహించని రికార్డులు బద్దలు కొడుతున్నారు. దీంతో.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఐపీఎల్‌లోని ఏ మ్యాచ్‌ను కూడా మిస్‌ అవ్వడానికి ఇష్టపడటం లేదు. సాయంత్రమైతే చాలు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇలా ఒక వైపు ఐపీఎల్‌ ధూమ్‌ధామ్‌గా సాగుతున్నా.. మరో వైపు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ప్రిపరేషన్స్‌ జరుగుతూనే ఉన్నాయి. నేడో రేపో టీ20 వరల్డ్‌ కప్‌ కోసం భారత సెలెక్టర్లు టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది.

ఈ క్రమంలో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఓ ఓనర్‌ షారుఖ్‌ ఖాన్‌ సెలెక్టర్లుకు ఓ కోరిక కోరాడు. టీ20 క్రికెట్‌లో తనదైన స్టైల్లో దూసుకెళ్తున్న యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోవాలని కోరాడు. మెగాటోర్నీకి రింకూ సింగ్‌ని ఎంపిక చేస్తే ఎంతో సంతోషిస్తాని షారుఖ్‌ పేర్కొన్నాడు. రింకూ లాంటి ప్లేయర్లు టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండాలి. కొందరు ఆటగాళ్లు దీనికి అర్హులు. రింకూ కచ్చితంగా జట్టులో ఉండాలని ఆశిస్తున్నా. అతను ఎంపికైతే నేను ఎంతో సంతోషిస్తా అని కింగ్‌ ఖాన్‌ తెలిపాడు. అయితే.. రింకూ టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఒక ఫినిషర్‌ రూపంలో ఉంటాడని చాలా రోజుల టాక్‌ వినిపిస్తూనే ఉంది. అయితే.. తాజాగా కొన్ని మ్యాచ్‌ల్లో రింకూ విఫలం అవుతున్నాడు.

అలాగే.. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి రిషభ్‌ పంత్‌, హార్ధిక్‌ పాండ్యా లాంటి ఆటగాళ్లు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో.. వారు కూడా ఫినిషర్‌ రోల్‌ని పోషిస్తారు కాబట్టి.. రింకూని ఎంపిక చేయాలా వద్దా? అనే ఆలోచనలో సెలెక్టర్లు పడినట్లు సమాచారం. రింకూ సింగ్‌ బదులు ఓ ఆల్‌రౌండర్‌ లేదా బౌలర్లు తీసుకుంటే.. బెటర్‌ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్‌ శర్మ, జైస్వాల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌ పేర్లు కచ్చితంగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉంటాయని బలంగా టాక్‌ వినిపిస్తోంది. వీళ్లు కాకుండా ఇంకెవరు టీమ్‌లో ఉంటారా? అనే విషయంపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి రింకూ సింగ్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోవాలని షారుఖ్‌ ఖాన్‌ కోరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.