Nidhan
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ క్షమాపణలు చెప్పాడు. కావాలని చేయలేదంటూ.. ఏం జరిగిందో వివరణ ఇచ్చాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ క్షమాపణలు చెప్పాడు. కావాలని చేయలేదంటూ.. ఏం జరిగిందో వివరణ ఇచ్చాడు.
Nidhan
సురేష్ రైనా, షాహిద్ అఫ్రిదీ.. క్రికెట్లో ఎప్పుడూ గుర్తుండిపోయే ఆటగాళ్లలో వీళ్లు తప్పక ఉంటారు. రైనా తన లెఫ్టాండ్ బ్యాటింగ్‌తో, అద్భుతమైన ఫీల్డింగ్‌తో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అవసరమైన సమయంలో స్పిన్ బౌలింగ్‌తోనూ బ్రేక్ త్రూలు అందించాడు. వన్డే వరల్డ్ కప్-2011ను భారత్ ఒడిసి పట్టడంలో అతడికి కీలకపాత్ర. అటు అఫ్రిదీని చూసుకుంటే క్రికెట్‌కు పాక్ అందించిన అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు గడించాడు. లెగ్ స్పిన్ బౌలింగ్, పించ్ హిట్టింగ్తో దాయాది జట్టుకు ఒంటిచేత్తో ఎన్నో విక్టరీలు అందించాడు. అఫ్రిదీ-రైనా ఫీల్డ్‌లో శత్రువులుగా ఉండేవారు. కానీ వీళ్ల మధ్య మంచి స్నేహమే ఉంది. అయితే ఇప్పుడు ఓ ఫ్యాన్ కారణంగా వీళ్ల నడుమ వివాదం చెలరేగింది.
పాకిస్థాన్ అభిమానుల గురించి తెలిసిందే. తమ జట్టే తోపు, తమ ఆటగాళ్లే గ్రేట్ అంటూ అనవసర బిల్డప్ ఇస్తుంటారు. ఇలాగే ఓ పాక్ ఫ్యాన్ అఫ్రిదీని గ్రేట్ అంటూ.. రైనాను రెచ్చగొట్టాడు. టీ20 వరల్డ్ కప్-2024కు బ్రాండ్ అంబాసిడర్‌గా అఫ్రిదీని నియమించిన నేపథ్యంలో రైనా చూశావా అంటూ ఆ అభిమాని టీజ్ చేశాడు. దీనికి టీమిండియా లెజెండ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాను ఐసీసీ అంబాసిడర్‌ను కాకపోవచ్చునని.. కానీ వన్డే వరల్డ్ కప్-2011 గెలిచిన భారత జట్టులో సభ్యుడినని అన్నాడు. మొహాలీ మ్యాచ్ గుర్తుందా.. అది చూడు మర్చిపోలేని జ్ఞాపకాలు గుర్తుకొస్తాయంటూ పంచ్ ఇచ్చాడు. ఆ ఏడాది మెగా టోర్నీలో మొహాలీ వేదికగా జరిగిన సెకండ్ సెమీ ఫైనల్లో పాక్‌ను 29 రన్స్ తేడాతో భారత్ చిత్తు చేసింది. అందుకే ఆ మ్యాచ్‌ను గుర్తుచేస్తూ కౌంటర్ ఇచ్చాడు రైనా.
రైనాను పాక్ ఫ్యాన్ రెచ్చగొట్టడం, అతడు దిమ్మతిరిగే రిప్లై ఇవ్వడం వైరల్‌గా మారింది. ఈ విషయం అటు ఇటు తిరిగి అఫ్రిదీ దగ్గరకు వచ్చింది. దీన్ని తెలుసుకున్న అతడు రైనాకు వెంటనే కాల్ చేశాడట. అతడికి సారీ చెప్పి.. కావాలని చేసింది కాదని వివరణ ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా అఫ్రిదీనే చెప్పాడు. ‘రైనా నాకు సోదరుడి లాంటోడు. అసలు ఏం జరిగిందనేది మొత్తం అతడికి వివరించా. దీంతో వివాదాస్పద ట్వీట్‌ను తొలగించేందుకు రైనా ఒప్పుకున్నాడు’ అని అఫ్రిదీ తెలిపాడు. ఈ విషయం తెలిసిన భారత ఫ్యాన్స్.. మళ్లీ ఇండియన్స్‌తో పెట్టుకోవద్దని కామెంట్స్ చేస్తున్నారు. తమతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్ కప్-2024కు అఫ్రిదీతో పాటు టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ కూడా అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. మరి.. రైనా-అఫ్రిదీ వివాదంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.