ఆసియా కప్ లో భాగంగా ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో దాయాది దేశాలు అయిన ఇండియా-పాక్ లు తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా క్రికెట్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ తో పాటుగా నేను కూడా అలానే ఎదురుచూస్తున్నాను అంటున్నాడు పాక్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది. అండర్-16 క్రికెట్ మెుదలు పెట్టకముందు తాను కూడా ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఇలాగే ఎదురుచూసేవాడినని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు ఈ పాక్ బౌలర్. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ఇంకా ముందు చాలా ఉంది అంటూ హెచ్చరించాడు.
షాహిన్ షా అఫ్రిది.. ప్రస్తుతం వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లలో ఒకడిగా పేరొందుతున్నాడు. తన పదునైన స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్, స్పీడ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో షాహిన్ దిట్ట. సహచర బౌలర్లు అయిన నసీం షా, హారిస్ రౌఫ్ లతో కలిసి పాక్ పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఇతడి బౌలింగ్ సత్తా ఏంటో టీమిండియా బ్యాటర్లతో పాటు ఇతర జట్లకు కూడా తెలిసొచ్చింది. కాగా.. తాజాగా ఆసియా కప్ లో తనదైన బౌలింగ్ తో చెలరేగుతున్నాడు ఈ కుర్ర బౌలర్. ఇక ఆదివారం ఇండియాతో మ్యాచ్ ఆడనున్న క్రమంలో షాహిన్ అఫ్రిది మీడియాతో మాట్లాడాడు.
షాహిన్ అఫ్రిది మాట్లాడుతూ..”నేను ఇప్పటి వరకు టీమిండియాతో ఆడిన మ్యాచ్ ల్లో నా బెస్ట్ స్పెల్ ఇదీ అని చెప్పలేను. కానీ ఇది ఆరంభం మాత్రమే.. నా సత్తా ఏంటో మున్ముందు ఇండియాకు చూపిస్తా. ఇక భవిష్యత్ లో సాధించాల్సింది చాలా ఉంది. అత్యుత్తమ గణాంకాలు సాధించి చూపాలి” అంటూ టీమిండియాను ముందే హెచ్చరించాడు. ఇక టీమిండియాతో ప్రతీ మ్యాచ్ దేనికదే ప్రత్యేకం అని చెప్పుకొచ్చాడు అఫ్రిది.
అతడు అండర్-16 క్రికెట్ స్టార్ట్ చేయకముందునుంచే మిగతా ఫ్యాన్స్ లాగే ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఎదురుచూసినట్లుగా పేర్కొన్నాడు. నసీం షా, హారిస్ రౌఫ్ లతో బంతిని ఎలా పంచుకోవాలో నాకు తెలుసు, మా మధ్య ఉన్న సమన్వయమే మా విజయాలకు కారణం అని ఈ సందర్భంగా షాహిన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో 7 వికెట్లు తీసి సత్తా చాటాడు షాహిన్. మరి మ్యాచ్ కు ముందు టీమిండియా గురించి షాహిన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shaheen Afridi said “Every match against India is special. I can’t say that spell (vs India) has been my best spell so far. This is just the start and there will be many more, so the best is yet to come.” #AsiaCup23 pic.twitter.com/WfF6XsKiYi
— Himanshu Pareek (@Sports_Himanshu) September 9, 2023