SNP
Shaheen Afridi, Shan Masood, PAK vs BAN: బంగ్లాదేశ్‌పై దారుణ ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టులో గొడవలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. అదేంటో? ఆ గొడవలేంటో ఇప్పుడు చూద్దాం..
Shaheen Afridi, Shan Masood, PAK vs BAN: బంగ్లాదేశ్‌పై దారుణ ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టులో గొడవలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. అదేంటో? ఆ గొడవలేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం చవిచూసింది. సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో బంగ్లా చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ దారుణ ఓటమితో ఒక వైపు పాకిస్థాన్ టీమ్‌పై విమర్శల వర్షం కురుస్తుంటే.. మరోవైపు ఆ జట్టులో ఆటగాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు బయటపడుతున్నాయి. మ్యాచ్ సందర్భంగా జరిగే టీమ్ మీటింగ్‌లో ఆటగాళ్లు ఒకరి భుజాలపై ఒకరు చేతులేసుకోవడం కామన్ కానీ, బంగ్లాదేశ్‌తో టెస్ట్ సందర్భంగా.. ఓ పాకిస్థాన్ ఆటగాడు తన కెప్టెన్ చేయి వేస్తే.. మొహమాటం లేకుండా.. తన భుజంపై ఉన్న చేతిని తన చేతితో తీసేశాడు.
ఈ చర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా మీలో మీరు కొట్టుకుంటూ ఉంటే.. ఇక మ్యాచ్‌లు ఏం గెలుస్తారంటూ పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు సైతం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ గొడవలో భాగమైంది ఎవరంటే.. స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ, కెప్టెన్ షాన్ మసూద్. టీమ్ హుడిల్‌లో భాగంగా.. షాహీన్ అఫ్రిదీపై షాన్ మసూద్ చేయి వేసి మాట్లాడుతున్న క్రమంలో.. షాహీన్ అఫ్రిదీ తన భుజంపై ఉన్న చేతిని నెట్టేశాడు. షాన్ మసూద్‌తో అఫ్రిదీకి అస్సలు పడటం లేదనే విమర్శలు, పాకిస్థాన్ టీమ్‌లో గ్రూపులు ఉన్నాయని, ఒకరంటే ఒకరికి పడదనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
తాజాగా ఈ వీడియోతో అవి మరోసారి బయటపడ్డాయని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ కోసం బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. పాక్‌కు షాకిస్తూ.. 565 పరుగుల భారీ స్కోర్ సాధించి మంచి లీడ్ తీసుకుంది. 565 రన్స్ చేసి ఆలౌట్ అయిన తర్వాత.. రెండో ఇన్నింగ్స్ కోసం బరిలోకి దిగిన పాక్‌ను కేవలం 146 పరుగులకే బంగ్లా బౌలర్లు ఆలౌట్ చేశారు. ఆ తర్వాత.. 30 రన్స్ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లా.. వికెట్లేమీ నష్టపోకుండా.. ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించి.. చరిత్ర లిఖించింది. మరి ఈ మ్యాచ్‌తో పాటు.. షాన్ మసూద్-షాహీన్ అఫ్రిదీ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
All is not well between Shaheen and Shan Masood #PAKvBAN pic.twitter.com/pQTV9f1eZG
— The Game Changer (@TheGame_26) August 25, 2024