iDreamPost
android-app
ios-app

షాహీన్‌ అఫ్రిదీని టీమ్‌ నుంచి తీసేసిన పాక్‌ క్రికెట్‌ బోర్డు! కెప్టెన్‌తో గొడవే కారణమా?

  • Published Aug 29, 2024 | 5:10 PM Updated Updated Aug 29, 2024 | 5:10 PM

Shaheen Afridi, PCB, PAK vs BAN: పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిదీపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. ఓ గొడవ కారణంగానే అతనిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ గొడవేంటో ఇప్పుడు చూద్దాం..

Shaheen Afridi, PCB, PAK vs BAN: పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిదీపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. ఓ గొడవ కారణంగానే అతనిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ గొడవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 29, 2024 | 5:10 PMUpdated Aug 29, 2024 | 5:10 PM
షాహీన్‌ అఫ్రిదీని టీమ్‌ నుంచి తీసేసిన పాక్‌ క్రికెట్‌ బోర్డు! కెప్టెన్‌తో గొడవే కారణమా?

పాకిస్థాన్‌ క్రికెట్‌లో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే రెండో టెస్టు కోసం ఎంపిక చేసిన 12 మందితో కూడిన స్క్వౌడ్‌లో షాహీన్‌ అఫ్రిదీని ఎంపిక చేయలేదు. రావాల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసి, ఇన్నింగ్స్‌ను 448 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసి మరీ.. పాకిస్థాన్‌ ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

తమ స్వదేశంలోని పిచ్‌పై, బంగ్లాదేశ్‌ లాంటి ఓ ఆర్డినరీ టీమ్‌పై టెస్ట్‌ మ్యాచ్‌ ఓడిపోవడంతో పాక్‌ టీమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం కేవలం స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిదీపైనే వేటు వేసింది. అయితే.. అతను తొలి టెస్టులో రాణించకపోవడంతో పాటు.. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌తో గొడవకు దిగడంతో అతనిపై చర్యలు తీసుకున్నట్లు పాకిస్థాన్‌ మీడియా పేర్కొంటోంది. బంగ్లాతో తొలి మ్యాచ్‌ సమయంలో తన భుజంపై కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ చేయి వేస్తే.. వెంటనే అతని చేతిని తన చేతితో నెట్టేస్తాడు. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డ్‌ అయి.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Shaheen Afridi

మ్యాచ్‌ ఓటమి తర్వాత.. షాన్‌ మసూద్‌, షాహీన్‌ అఫ్రిదీ మధ్య పెద్ద గొడవ జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మసూద్‌, షాహీన్‌ అఫ్రిదీ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని, మధ్యలో గొడవ ఆపేందుకు రిజ్వాన్‌ వస్తే అతన్ని కూడా కొట్టినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. అయితే.. ఈ గొడవ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలు షాహీన్‌ అఫ్రిదీపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే కెప్టెన్‌ షాన్‌ మసూద్‌కు కూడా వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రెండో టెస్ట్‌కు స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదీని పక్కనపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.