iDreamPost
android-app
ios-app

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన SRH.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌ క్రికెటర్‌!

  • Published Mar 24, 2024 | 2:39 PMUpdated Mar 24, 2024 | 4:42 PM

Shahbaz Ahmed, SRH vs KKR, IPL 2024: ఐపీఎల్‌ ఆరంభమైన రెండో రోజే నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్‌ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓడిపోవడంతో ఓ స్టార్‌ క్రికెటర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Shahbaz Ahmed, SRH vs KKR, IPL 2024: ఐపీఎల్‌ ఆరంభమైన రెండో రోజే నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్‌ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓడిపోవడంతో ఓ స్టార్‌ క్రికెటర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Mar 24, 2024 | 2:39 PMUpdated Mar 24, 2024 | 4:42 PM
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన SRH.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌ క్రికెటర్‌!

ఐపీఎల్‌ 2024లో భాగంగా శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ జరిగింది. చివరి ఓవర్‌ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ బౌలర్‌ హర్షిత్‌ రాన సూపర్‌ బౌలింగ్‌తో ఆ జట్టు సూపర్‌ విక్టరీని అందుకుని.. ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. అయితే.. గెలుపు ముంగిట్లోకి వచ్చి ఓడిపోవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు తెగ బాధపడుతున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ చివరి బాల్‌ వరకు రావడంతో తన వంత పాత్ర పోషించిన ఓ యువ స్టార్‌ క్రికెటర్ల మ్యాచ్‌ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ ఎమోషనల్‌ సీన్స్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్‌ ఓడిపోయామని కన్నీళ్లు పెట్టుకున్న ఆ క్రికెటర్‌ ఎవరో ఏంటో ఇప్పుడు చూద్దాం..

టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఓ 13 ఓవర్ల వరకు మ్యాచ్‌ను తమ కంట్రోల్‌లోనే ఉంచుకుంది. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ బ్యాటర్లను పెద్దగా పరుగులు చేయనివ్వలేదు. కానీ, ఎప్పుడైతే ఆండ్రీ రస్సెల్‌ బ్యాటింగ్‌కు వచ్చాడో.. సన్‌రైజర్స్‌ బౌలర్ల చేతులెత్తేశారు. అంతకంటే ముందు రమన్‌దీప్‌సింగ్‌ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్ల ఎదురుదాడికి దిగి స్కోర్‌లో వేగం పెంచాడు. కానీ, రస్సెల్‌ ఒక ఉప్పెనలా సన్‌రైజర్స్‌ టీమ్‌పై పడిపోయాడు. కేవలం 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 64 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో కేకేఆర్‌ జట్టు అంచనాలను తలకిందుకు చేస్తూ.. 208 పరుగుల భారీ స్కోర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ముందు ఉంచింది. 209 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ మంచి స్టార్ట్‌ ఇచ్చారు. 5.2 ఓవర్లలోనే జట్టు స్కోర్‌ను 60కి చేర్చారు. కానీ, ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌లో వేగం తగ్గింది.

ఓపెనర్లు అవుట్‌ అయ్యాకా.. రాహుల్‌ త్రిపాఠి, ఎడెన్‌ మార్కరమ్‌ పెద్దగా రాణించలేదు. కానీ, క్లాసెన్‌ మాత్రం కేకేఆర్‌ బౌలర్లను చీల్చించెండాడు. ఒక వైపు క్లాసెన్‌ చెలరేగుతుంటే.. అబ్దుల్‌ సమద్‌ ఓ రెండు సూపర్‌ షాట్స్‌ ఆడి.. అవుట్‌ అయ్యాడు. అప్పుడు క్రీజ్‌లోకి వచ్చాడు షాబాజ్‌ అహ్మద్‌. అతను క్రీజ్‌లో వచ్చే సమయానికి సన్‌రైజర్స్‌ విజయానికి 19 బంతుల్లో 64 పరుగులు కావాలి. చాలా కష్టమైన టార్గెట్‌. అయినా కూడా క్లాసెన్‌ ఉన్నాడనే ధైర్యం అందరిలో ఉంది. షాబాజ్‌ కూడా ఎదుర్కొన్న తొలి బంతికి ఫోర్‌, తర్వాత బంతికి సిక్స్‌, మళ్లి 19వ ఓవర్‌ చివరి బంతికి సిక్స్‌.. ఇలా కేవలం 4 బంతుల్లోనే 16 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

క్లాసెన్‌ విధ్వంసానికి తాను తోడయ్యాడు. అగ్నికి వాయువు తోడైనట్లు. అంతే ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం ఖాయమైంది. 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన టైమ్‌లో షాబాజ్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి.. కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. తర్వాత 3 బంతుల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి 4 రన్స్‌ తేడాతో ఓటమిపాలైంది. కచ్చితంగా గెలిచే మ్యాచ్‌లో ఊహించని ఈ ఓటమితో.. సూపర్‌ క్యామియో ఆడిన షాబాజ్‌ అహ్మద్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ డగౌట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను ఆ షాట్‌ ఆడకపోయి ఉంటే.. మ్యాచ్‌ గెలిచే వాళ్లం ఏమో అని షాబాజ్‌ బాధపడినట్లు తెలుస్తోంది. షాబాజ్‌ కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి