iDreamPost

ఆ టీమిండియా స్టార్ ను ఔట్ చేయడానికి ఎన్ని ప్లాన్లు వేసినా వేస్టే: షాదాబ్ ఖాన్

  • Author Soma Sekhar Published - 03:44 PM, Mon - 2 October 23
  • Author Soma Sekhar Published - 03:44 PM, Mon - 2 October 23
ఆ టీమిండియా స్టార్ ను ఔట్ చేయడానికి ఎన్ని ప్లాన్లు వేసినా వేస్టే: షాదాబ్ ఖాన్

ఓ వైపు పాకిస్థాన్ దిగ్గజాలు సొంత జట్టు పరువు తీస్తుంటే.. మరోవైపు పాక్ ఆటగాళ్లు మాత్రం టీమిండియాపై అలాగే భారత ప్లేయర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరల్డ్ కప్ లో పాల్గొనడానికి పాక్ జట్టు ఇప్పటికే ఇండియా వచ్చింది. ప్రస్తుతం పాక్ టీమ్ హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ క్రికెటర్ పై పాక్ టీమ్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఆ టీమిండియా బ్యాటర్ కు బౌలింగ్ చేయడం అసాధ్యం అని, అతడిని ఔట్ చేయడానికి ఎన్ని ప్రణాళికలు వేసినా దండగే అంటూ చెప్పుకొచ్చాడు షాదాబ్. మరి షాదాబ్ చెప్పిన ఆ టీమిండియా బ్యాటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

మరో రెండు రోజుల్లో వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభం కానుంది. దీంతో ప్రపంచ కప్ లో పాల్గొనే అన్ని జట్లు ఇండియా చేరి.. ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే క్రికెటర్లు, క్రీడా పండితులు ఇతర ఆటగాళ్ల సత్తా గురించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ టీమిండియా సారథి రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత సమకాలీన వరల్డ్ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం అసాధ్యమని షాదాబ్ పేర్కొన్నాడు. అదీకాక అతడిని ఔట్ చేయడానికి ఎన్ని ప్లాన్లు వేసినా గానీ ఫలితం ఉండదని చెప్పుకొచ్చాడు.

ఇక రోహిత్ ఫామ్ లో ఉంటే అతడిని అడ్డుకోవడం అంత తేలికకాదని షాదాబ్ అభిప్రాయపడ్డాడు. అతడి ఫామ్ ను బట్టే మేం బౌలింగ్ స్టైల్ మార్చుకోవాలని చెప్పాడు. మేం ఎన్ని బౌలింగ్ యాక్షన్ లు మార్చినాగానీ.. అతడు బాల్ ను బౌండరీకి పంపిస్తాడని షాదాబ్ తెలిపాడు. ఇక టీమిండియాలో కుల్దీప్ యాదవ్ నా ఫేవరెట్ బౌలర్ అంటూ చెప్పుకొచ్చాడు. కుల్దీప్ బౌలింగ్ ను ఆడటమే కాదు.. అంచనా వేయడం కూడా కష్టమే అంటూ కితాబిచ్చాడు ఈ పాక్ ప్లేయర్. కాగా.. హైదరాబాద్ లో తమకు లభించిన ఆతిథ్యం సూపర్ అంటూ మెచ్చుకున్నాడు. మరి రోహిత్ శర్మపై పాక్ వైస్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి