ఇంగ్లండ్‌ టీమ్‌లో ఆడుతున్న RP సింగ్‌ కొడుకు హ్యారీ సింగ్‌! లంక టెస్ట్‌తో బరిలోకి..

Senior RP Singh, Harry Singh, ENG vs SL: టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ కుమారుడు.. ఇప్పుడు ఇంగ్లండ్‌ తరఫున ఆడుతున్నాడు. అతని పేరు హ్యారీ సింగ్‌. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

Senior RP Singh, Harry Singh, ENG vs SL: టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ కుమారుడు.. ఇప్పుడు ఇంగ్లండ్‌ తరఫున ఆడుతున్నాడు. అతని పేరు హ్యారీ సింగ్‌. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత మూలాలున్న ఓ క్రికెటర్‌ బరిలోకి దిగాడు. నిజానికి భారత మూలాలు కాదు.. అతను ఓ టీమిండియా మాజీ క్రికెటర్‌ కుమారుడు. అతని పేరు హ్యారీ సింగ్‌. ఇంగ్లండ్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు టువెల్త్‌(12th) మ్యాన్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న తర్వాత.. ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌కు దిగింది. ఆ సమయంలో హ్యారీ సింగ్‌ టువెల్త్‌ మ్యాన్‌గా ఫీల్డింగ్‌కి వచ్చాడు. తర్వాత మరోసారి హ్యారీ బ్రూక్‌కు సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌కి వచ్చాడు.

అయితే.. పేరు చివర్లో సింగ్‌ ఉండటంతో.. ఇతనికి భారత మూలాలు ఉన్నాయని క్రికెట్‌ నిపుణులు ఆరా తీస్తే.. టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ కొడుకుగా తేలడంతో అంతా షాక్‌ అవుతున్నారు. అయితే.. ధోని కెప్టెన్సీ టీ20 వరల్డ్‌ కప్‌ 2007 ఆడిన ఆర్పీ సింగ్‌ కాదు. అతని కంటే ముందు.. టీమిండియా అదే పేరుతో ఆర్పీ సింగ్‌(రుద్ర ప్రతాప్‌ సింగ్‌) అని ఓ క్రికెటర్‌ ఉన్నారు. ఆయనను సీనియర్‌ ఆర్పీ సింగ్‌ అని కూడా పిలుస్తారు. 1965లో ఉత్తర ప్రదేశ్‌లో జన్మించిన ఈ సీనియర్‌ ఆర్పీ సింగ్‌ 1982 నుంచి 1996 మధ్య ఉత్తర ప్రదేశ్, ఇంగ్లీష్ కౌంటీ జట్ల కోసం 59 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.

అలాగే 1986 సెప్టెంబర్‌ 24న ఆస్ట్రేలియాతో హైదరాబాద్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన కెరీర్‌లో కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడారు. అందులో ఒక వికెట్‌ పడగొట్టారు. 1990లో ఆర్పీ సింగ్ ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. లంకేషైర్ కౌంటీ క్లబ్ టీమ్‌కు కోచ్‌గా కూడా పనిచేశారు. ఆయన కుమారుడే ఈ హ్యారీ సింగ్‌. తండ్రిలానే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న హ్యారీ సింగ్‌.. ఇంగ్లండ్ దేశవాళి క్రికెట్‌లో అదరగొడుతూ.. ఇంగ్లండ్‌, శ్రీలంక తొలి టెస్ట్‌కు టువెల్త్‌ మ్యాన్‌గా ఎంపికయ్యాడు. అలాగే అండర్‌ 19 క్రికెట్‌లోను అదరగొట్టాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌ నేషనల్‌ టీమ్‌లోకి వచ్చాడు. మరి ఈ హ్యారీ సింగ్‌ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments