రియాన్‌ పరాగ్‌కు BCCI ప్రమోషన్‌.. కుర్రాడి కష్టానికి దక్కిన ఫలితం?

Riyan Parag, T20 World Cup 2024: రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున అదరగొడుతున్న రియాన్‌ పరాగ్‌కు భారీ ప్రమోషన్‌ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ అయిపోయింది. మరి ఆ బిగ్‌ ప్రమోషన్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Riyan Parag, T20 World Cup 2024: రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున అదరగొడుతున్న రియాన్‌ పరాగ్‌కు భారీ ప్రమోషన్‌ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ అయిపోయింది. మరి ఆ బిగ్‌ ప్రమోషన్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రాజస్థాన్‌ రాయల్స్‌కు ఎప్పటి నుంచో ఆడుతున్న రియాన్‌ పరాగ్‌.. ఈ సీజన్‌లో మాత్రం డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. సూపర్‌ బ్యాటింగ్‌తో ఓ ప్రో ప్లేయర్‌లా ఇరగదీస్తున్నాడు. ఇన్నేళ్లుగా పరాగ్‌ నుంచి ఏం ఆశించి.. రాజస్థాన్‌ రాయల్స్‌ అతన్ని టీమ్‌లో కొనసాగించిందో దాని ఫలితం ఈ సీజన్‌లో చూపిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌ అనే కదా ఏడాది కాలంగా దేశవాళి క్రికెట్‌లోనే దుమ్మురేపాడు. ఎంతో నిలకడగా ఆడుతూ.. రంజీతో పాటు ముస్తాక్‌ అలీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీల్లో కూడా మంచి ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అయితే పీక్స్‌లోకి వచ్చేశాడు. దీంతో.. రియాన్‌పై సెలక్టర్ల కన్ను పడినట్లు సమచారం. ఐపీఎల్‌ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసి.. అక్కడ రాణిస్తే.. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ముంబైలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో భారత చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ సమావేశం అయ్యాడు. ఈ భేటీలో రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఎలాంటి టీమ్‌తో వెళ్లాలి. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రాణిస్తున్న ఆటగాళ్లు, టీమ్‌కి కావాల్సిన స్పాట్స్‌ కోసం ఎవర్ని ఎంపిక చేయాలనే విషయం తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి చర్చల్లో రియాన్‌ పరాగ్‌ పేరు కూడా వచ్చినట్లు సమాచారం. ఐపీఎల్‌తో పాటు దేశవాళి క్రికెట్‌లో అదరగొడుతున్న రియాన్‌ పరాగ్‌ లాంటి యంగ్‌ ప్లేయర్‌ను టీ20 టీమ్‌లోకి తీసుకుంటే ఎంతో బాగుంటుందని అజిత్‌ అగార్కర్‌, రోహిత్‌ శర్మ కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. త్వరలోనే రియాన్‌ పరాగ్‌కు టీమిండియాలో చోటిచ్చి.. అతనికి ప్రమోషన్‌ ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పరాగ్‌.. వరుసగా 43, 84(నాటౌట్‌), 54(నాటౌట్‌), 4, 76, 23, 34 పరుగులతో అదరగొట్టాడు. పక్కా టీ20 ఇన్నింగ్సులు ఆడుతూ.. రాజస్థాన్‌కు ఒక బలమైన శక్తిగా మారాడు. ఏకంగా విరాట్‌ కోహ్లీతో ఆరెంజ్‌ క్యాప్‌ కోసం పోటీ పడే స్థాయికి ఎదిగిపోయాడు పరాగా. ఏడు మ్యాచ్‌ల్లో 318 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం, చురుకైన ఫీల్డర్ కావడంతో పరాగ్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోవాలని రోహిత్‌ చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. మరి పరాగ్‌ను టీమిండియాలోకి తీసుకుంటారనే వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments