Nidhan
Charlie Cassell: డెబ్యూ మ్యాచ్‌లోనే ఓ స్కాట్లాండ్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు.
Charlie Cassell: డెబ్యూ మ్యాచ్‌లోనే ఓ స్కాట్లాండ్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు.
Nidhan
ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడటం చాలా మంది ఆటగాళ్ల కల. చిన్నప్పటి నుంచి అహర్నిషలు శ్రమించి, ఎన్నో త్యాగాలు చేస్తూ కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేరు. అయితే ఆ రేంజ్‌కు చేరుకోవడం ఒక లెక్కయితే, అక్కడ పెర్ఫార్మ్ చేయడం మరొక లెక్కనే చెప్పాలి. చాలా మంది బెస్ట్ ప్లేయర్స్ డొమెస్టిక్ లెవల్లో అదరగొట్టినా.. ఇంటర్నేషనల్ క్రికెట్లో తేలిపోతుండటం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఉండే క్వాలిటీ క్రికెట్, ప్రెజర్, ఎక్స్‌పెక్టేషన్స్‌ను దాటి రాణించడం అంటే మాటలు కాదు. అందునా తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగు చేయాలన్నా, ఒక వికెట్ తీయాలన్నా అరంగేట్ర ఆటగాళ్లు ఫుల్ ప్రెజర్‌కు లోనవుతారు. అలాంటిది డెబ్యూ మ్యాచ్‌లోనే ఓ స్కాట్లాండ్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు.
స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాసెల్ తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించాడు. ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా ఒమన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ప్రత్యర్థి జట్టును అతడు వణికించాడు. ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్ హిస్టరీలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చార్లీ కాసెల్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు డెబ్యూ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ (6/16) పేరిట ఉండేది. దీన్ని ఇప్పుడు కాసెల్ బద్దలు కొట్టాడు. మొత్తంగా 5.4 ఓవర్లు వేసిన ఈ పేసర్.. 21 పరుగులు ఇచ్చి ఏడుగుర్ని పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఒమన్ 91 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మరి.. డెబ్యూ మ్యాచ్‌లోనే స్కాట్లాండ్ బౌలర్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును భవిష్యత్తులో ఇంకెవరైనా అధిగమించగలరని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
5️⃣.4️⃣ overs
1️⃣ maiden
2️⃣1️⃣ runs
7️⃣ wicketsCharlie Cassell with the 𝘽𝙀𝙎𝙏 𝙀𝙑𝙀𝙍 figures on ODI debut 🤯🤩🔥#FollowScotland pic.twitter.com/EXSw7ixucZ
— Cricket Scotland (@CricketScotland) July 22, 2024