iDreamPost
android-app
ios-app

T20 World Cup: ఇంగ్లండ్‌ను వణికించిన స్కాట్లాండ్‌ బ్యాటర్‌! కొడితే రూఫ్‌ పగిలిపోయింది

  • Published Jun 05, 2024 | 1:08 PMUpdated Jun 05, 2024 | 1:08 PM

Scotland vs England, Michael Jones, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో చిన్న టీమ్‌ ఆటగాళ్లు కూడా అల్లాడిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్‌ బౌలర్‌ను లెక్కచేయకుండా స్కాట్లాండ్‌ బ్యాటర్‌ స్టేడియం రూఫ్‌ను బద్దలు కొట్టాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Scotland vs England, Michael Jones, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో చిన్న టీమ్‌ ఆటగాళ్లు కూడా అల్లాడిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్‌ బౌలర్‌ను లెక్కచేయకుండా స్కాట్లాండ్‌ బ్యాటర్‌ స్టేడియం రూఫ్‌ను బద్దలు కొట్టాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Jun 05, 2024 | 1:08 PMUpdated Jun 05, 2024 | 1:08 PM
T20 World Cup: ఇంగ్లండ్‌ను వణికించిన స్కాట్లాండ్‌ బ్యాటర్‌! కొడితే రూఫ్‌ పగిలిపోయింది

క్రికెట్‌లో బ్యాటర్లు కొట్టే కొన్ని భారీ షాట్లు స్టేడియంలో ప్రేక్షకులను గాయాల పాలు చేశాయి. కొన్ని సార్లు స్టాండ్స్‌లోని అద్దాలను బద్దలు కొట్టాయి. అలాగే కొన్ని బంతులు ఏకంగా గ్రౌండ్‌ బయటికి వెళ్లి పడ్డాయి. మరికొన్ని స్టేడియం రూఫ్‌పై పడి.. తీయడానికి కూడా వీలులేకుండా ఉండే సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ స్కాట్లాండ్‌ బ్యాటర్‌ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం రూఫ్‌ని బద్దలు కొట్టింది. ఈ సంఘటన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ జట్టు.. ఇంగ్లండ్‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

స్కాట్లాండ్‌ ఓపెనర్లు జార్జ్ మున్సే, మైఖేల్‌ జోన్స్‌ ఇంగ్లీష్‌ బౌలర్లను పిచ్చి కొట్టాడు కొట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌లో స్కాట్లాండ్‌ చిన్న టీమ్‌గానే ఉన్నా.. ఆటలో మాత్రం ఆ మాట మర్చిపోయేలా చేసింది. టీ20 వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ఆడుతున్నాం అనే విషయం మర్చిపోయి మరీ.. చెలరేగిపోయి ఆడింది. జార్జ్‌ మున్సే 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేశాడు. అలాగే మైఖేల్‌ జోన్స్‌ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేశారు. అయితే.. ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ రెండో బంతికి మైఖేల్‌ జోన్స్‌ కొట్టిన షాట్‌ ఏకంగా స్టేడియం రూఫ్‌పైకి వెళ్లి పడింది. రూఫ్‌పై ఉన్న సోలార్‌ ప్యానెల్స్‌ను బద్దలు కొట్టింది. ఈ షాట్‌ చూసి.. వామ్మో స్కాట్లాండ్‌ టీమ్‌లో ఇంత భారీ హిట్టర్‌ ఉన్నాడా అంటూ క్రికెట్‌ అభిమానులు షాక్‌ అవుతున్నారు.

పైగా ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ బౌలింగ్‌లో ఈ షాట్‌ కొట్టడం విశేషం. అయితే.. స్కాట్లాండ్‌ ఓపెనర్ల దూకుడు చూసి.. వరుణ దేవుడికి కూడా మ్యాచ్‌ చూడాలని అనిపించిందో ఏమో కానీ.. ఇంగ్లండ్‌ బౌలర్ల కన్నీళ్లను తుడుస్తూ.. గ్రౌండ్‌లోకి దిగిపోయాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయింది. అప్పటికే 10 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా స్కాట్లాండ్‌ ఓపెనర్లు 90 పరుగులు చేసి.. ఇంగ్లండ్‌ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నార. మ్యాచ్‌ జరిగి ఉంటే ఫలితం ఎలా ఉండేదో కానీ.. జరిగిన 10 ఓవర్లలో మాత్రం స్కౌట్లాండ్‌ ఓపెనర్లు.. ఇంగ్లండ్‌ బౌలర్లను వణికించారు. మరి స్కాట్లాండ్‌ బ్యాటర్‌ మైఖేల్‌ జోన్స్‌ కొట్టిన భారీ సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి