Somesekhar
Sarfaraz Khan, IPL 2024: ఒకే ఒక్క మ్యాచ్ తో తానేంటో నిరూపించుకున్నాడు యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్. తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపడంతో.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ కు ఆ టీమ్ లోకి సర్ఫరాజ్ వెల్లనున్నాడని సమాచారం.
Sarfaraz Khan, IPL 2024: ఒకే ఒక్క మ్యాచ్ తో తానేంటో నిరూపించుకున్నాడు యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్. తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపడంతో.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ కు ఆ టీమ్ లోకి సర్ఫరాజ్ వెల్లనున్నాడని సమాచారం.
Somesekhar
సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం టీమిండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దానికి కారణం ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ తో టీమిండియాలోకి డెబ్యూ చేయడమే కాక.. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించి.. అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరదపారించిన సర్ఫరాజ్ ను ఎట్టకేలకు కనికరించారు సెలెక్టర్లు. తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఈ యంగ్ బ్యాటర్. ఇక ఒకే ఒక్క మ్యాచ్ తోనే ఐపీఎల్ 2024లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
సర్పరాజ్ ఖాన్.. టీమిండియా బ్రాడ్ మన్ గా డొమెస్టిక్ క్రికెట్ లో తన పేరును మారుమ్రోగించాడు. వేల కొద్ది పరుగులు చేసి.. 3 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఎంట్రీ కూడా ఎంతో ఘనంగా ఉంది. ఇంగ్లాండ్ తో ఇటీవల జరిగిన మూడో టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా అర్ధశతకాలు బాది అదరగొట్టాడు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదంతా ఇప్పుడు.
కానీ కొన్నిరోజుల ముందు జరిగిన ఐపీఎల్ 2024 మినీవేలంలో సర్ఫరాజ్ ను పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో అమ్ముడుపోని ఆటగాళ్ల లిస్టులో చేరాడు సర్పరాజ్ ఖాన్. బండ్లు ఓడలౌతాయి.. ఓడలు బండ్లు అవుతాయి అంటే ఇదేనేమో. అప్పుడు వద్దు పొమ్మన్న ఫ్రాంచైజీలే ఇప్పుడు రెడ్ కార్పెట్ పరిచి మరీ రమ్ముంటున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సర్ఫరాజ్ ఖాన్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో సర్ఫరాజ్ కేకేఆర్ జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడిని టీమ్ లోకి తీసుకోవడానికి కోల్ కత్తా ఫ్రాంచైజీ మెుగ్గుచూపుతోంది. ఈ టీమ్ తో పాటుగా మరికొన్ని జట్లు అతడిపై ఓ కన్నేశాయి. ఇదే గనక నిజమైతే.. ఐపీఎల్ లో సర్పరాజ్ మెరుపులు చూడొచ్చు.
గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహించాడు ఈ స్టార్ బ్యాటర్. కానీ ఈ సీజన్ లో ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో అతడు ఈ ఐపీఎల్ సీజన్ లో కనిపించడం కష్టమే అని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా కేకేఆర్ జట్టు అతడిపై మనసుపడింది. పైగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి.. అతడి బేస్ ధర రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెరగబోతోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Which team will Sign Sarfaraz khan for IPL 2024!!!!!!!!
Any Guesses👀???#IPL2024 #IPL #INDvENGTest pic.twitter.com/CGAgl40YGq
— CricZone_Official (@Criczone25) February 20, 2024
ఇదికూడా చదవండి: IPL స్టార్టింగ్ డేట్ లీక్.. ఇంత ముందుకి పెట్టేశారా? ఇక పండగే!