iDreamPost
android-app
ios-app

Shubman Gill: వీడియో: గిల్ సిస్టర్​తో సారా టెండూల్కర్.. కెమెరాల నుంచి తప్పించుకునేందుకు..!

  • Published Jan 21, 2024 | 2:25 PM Updated Updated Jan 21, 2024 | 2:25 PM

సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్​ గురించి తెలిసిందే. క్రికెట్​ మ్యాచ్​లు చూసేందుకు అప్పుడప్పుడు స్టేడియాలకు వచ్చే సారాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్​ గురించి తెలిసిందే. క్రికెట్​ మ్యాచ్​లు చూసేందుకు అప్పుడప్పుడు స్టేడియాలకు వచ్చే సారాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Jan 21, 2024 | 2:25 PMUpdated Jan 21, 2024 | 2:25 PM
Shubman Gill: వీడియో: గిల్ సిస్టర్​తో సారా టెండూల్కర్.. కెమెరాల నుంచి తప్పించుకునేందుకు..!

క్రికెట్​కు సంబంధించిన ఏ విషయమైనా మన దేశంలో ఇట్టే వైరల్ అయిపోతుంది. క్రికెటర్లకు ఉన్న ఫ్యాన్​బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్లేయర్లకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు. వారి ప్రొఫెషనల్ కెరీర్​తో పాటు పర్సనల్ లైఫ్​లోని విశేషాలు కూడా తెలుసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ఏ క్రికెటర్ ఎవరితో రిలేషన్​లో ఉన్నాడు? ఏ ప్లేయర్ ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు? లాంటి గాసిప్స్ బాగా వైరల్ అవుతుంటాయి. టీమిండియాలో ఈ మధ్య కాలంలో ఇలాగే ఓ ఆటగాడికి సంబంధించిన లవ్ లైఫ్​పై బాగా రూమర్స్ వస్తున్నాయి. అతడే స్టార్ ఓపెనర్ శుబ్​మన్ గిల్. భారత జట్టులో మూడు ఫార్మాట్లలోనూ ప్లేస్ పర్మినెంట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడతను. అయితే ఓ మాజీ క్రికెటర్ కూతురితో అతడు ప్రేమలో ఉన్నాడనే గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్​తో గిల్ ప్రేమాయణం నడిపిస్తున్నాడనే రూమర్స్ చాన్నాళ్లుగా వస్తున్నాయి. అయితే దీనిపై ఇటు గిల్, అటు సారా ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. దీంతో వీళ్ల లవ్ నిజమేనంటూ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. గిల్ బ్యాటింగ్ టైమ్​లో సారా స్టేడియాల్లో ప్రత్యక్షమవడం, అతడ్ని ఎంకరేజ్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా గిల్ సోదరి షానీల్ గిల్​తో కలసి ఓ కారులో ప్రయాణిస్తూ కనిపించింది సారా. వీళ్ల కారును మీడియా కెమెరాలు చుట్టుముట్టాయి. దీంతో కెమెరాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది సారా. తన రెండు చేతులను ముఖానికి అడ్డంగా పెట్టుకుంది. అయితే ఎంతకీ కెమెరాలు తీయకపోవడంతో ఆఖరికి చేతులను తీసి నవ్వుతూ కనిపించింది.

గిల్ సోదరి షానీల్​తో కలసి సారా ఔటింగ్​కు వెళ్లిందని క్రీడా వర్గాలు అంటున్నాయి. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని.. అప్పుడప్పుడు కలవడం, సరదాగా బయటకు వెళ్లడం కామన్ అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. శుబ్​మన్ ఫ్యామిలీకి సారా బాగా దగ్గరైందని అంటున్నారు. గిల్-సారా లవ్​కు ఇదే ప్రూఫ్ అని.. వాళ్లిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోవడం ఖాయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గిల్​ను ప్రేమించకపోతే కెమెరాలు రాగానే సారా ఎందుకు ముఖం దాచుకుందని ప్రశ్నిస్తున్నారు. గిల్​తో రిలేషన్​షిప్​కు సంబంధించి నిజం ఏంటనేది అందరికీ చెప్పేస్తే సరిపోతుందని.. క్లారిటీ వచ్చేస్తుందని చెబుతున్నారు. మరి.. గిల్ సోదరితో కలసి సారా టెండూల్కర్ ఇలా కెమెరాలకు చిక్కడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş