IND vs AFG: వీడియో: మ్యాచ్‌లో ఎవరూ గమనించి ఉండరు! సంజు సత్తా ఇదీ!

సూపర్‌ థ్రిల్లర్‌గా సాగిన ఇండియా వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్‌ మూడో టీ20లో ఒక అద్భుతమైన ఘటనను ఎవరూ గుర్తించలేకపోయారు. రోహిత్‌ సెంచరీ, కోహ్లీ సూపర్‌ ఫీల్డింగ్‌, సూపర్‌ ఓవర్ల నేపథ్యంలో సంజు చేసిన అద్భుతం కనిపించకుండా పోయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సూపర్‌ థ్రిల్లర్‌గా సాగిన ఇండియా వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్‌ మూడో టీ20లో ఒక అద్భుతమైన ఘటనను ఎవరూ గుర్తించలేకపోయారు. రోహిత్‌ సెంచరీ, కోహ్లీ సూపర్‌ ఫీల్డింగ్‌, సూపర్‌ ఓవర్ల నేపథ్యంలో సంజు చేసిన అద్భుతం కనిపించకుండా పోయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య బుధవారం థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టీ20లో టీమిండియా-ఆఫ్థనిస్థాన్‌ హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్‌ టైగా ముగియడంతో అంపైర్లు సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఆ సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియడంతో మళ్లీ సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఇలా నరాలు తెగే ఉత్కంఠ మధ్య నామమాత్రమైన చివరి మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు అద్భుతమైన క్రికెట్‌ మజాను పంచింది. అయితే.. మ్యాచ్‌ చివర్లో చాలా థ్రిల్లింగ్‌గా సాగడంతో మ్యాచ్‌లో జరిగిన ఒక అద్భుతమైన ఘటనను క్రికెట్‌ అభిమానులు గుర్తించలేకపోయారు. ఆ ఘటనలో టీమిండియా క్రికెటర్‌ సూపర్‌ పవర్‌ దాగి ఉంది. అప్పుడెప్పుడో ధోనిలో చూసిన టాలెంట్‌ మళ్లీ ఈ క్రికెటర్‌ చూపించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఆఫ్ఘాన్‌తో జరిగిన మూడో టీ20ల్లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి.. 212 పరుగుల భారీ టార్గెన్‌ను ప్రత్యర్థి ముందు ఉంచింది. కానీ, ఆఫ్ఘాన్‌ కూడా అంతే డేంజర్‌గా ఆడి.. ఆ స్కోర్‌ను సమం చేసింది. అయితే.. ఆఫ్ఘాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. టీమిండియా వికెట్‌ కీపర్‌ ఒక సెన్సేషనల్‌ త్రోతో.. క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. మ్యాచ్‌ టై కాకుండా ఉండి ఉంటే, సూపర్‌ ఓవర్లు పడకపోయినా.. ఆ త్రో మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచేది. కానీ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ, కోహ్లీ సూపర్‌ ఫీల్డింగ్‌, సూపర్‌ ఓవర్లు పడటంతో సంజు సూపర్‌ త్రో పెద్దగా వైరల్‌ కాలేదు. లేకుంటే.. ధోని రేంజ్‌లో సంజుకి కూడా ప్రశంసలు దక్కేవి. ఎందుకంటే.. కీపర్‌గా ఉంటూ గ్లౌజ్‌ తీసేసి అద్భుతమైన త్రోలు కొట్టడం ధోనికి వెన్నెతో పెట్టిన విద్య. దాన్ని ఇప్పుడు సంజు కూడా చూపించాడు.

ఆఫ్ఘాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో భారత బౌలర్‌ ముఖేష్‌ కుమార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఈ అద్భుతం జరిగింది. ముఖేష్‌ వేసిన బాల్‌ను సరిగా టైమ్‌ చేయడంలో గుల్బద్దీన్‌ విఫలం అయ్యాడు. అది ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని కీపర్‌ వద్దకు వెళ్లింది. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కరీమ్‌ జనత్‌ పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ, గుల్బద్దీన్‌ మాత్రం అక్కడే ఉండిపోయాడు. దీంతో కరీమ్‌ క్రీజ్‌ మధ్య వరకు వచ్చి.. తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన చేతిలో బ్యాట్‌ కూడా జారిపోయింది. అయితే.. కరీమ్‌ రన్‌ కోసం ప్రయత్నించడం గమనించిన సంజు శాంసన్‌.. నేరుగా నాన్‌స్ట్రకర్‌ ఎండ్‌ వైపు బాల్‌ విసిరాడు. అది నేరుగా త్రో తగలడంతో సంజు దెబ్బకు కరీమ్‌ పెవిలియన్‌ బాట పట్టాల్సి వచ్చింది. ఇలా తన అద్బుతమైన త్రోతో సంజు ఆఫ్ఘాన్‌ను దెబ్బకొట్టాడు. గతంలో ధోని కూడా ఇలా గురి తప్పకుండా రనౌట్లు చేసేవాడు. ఇప్పుడు సంజు కూడా సేమ్‌ ఫీట్‌ను రిపీట్‌ చేశాడు. మరి ఈ సూపర్‌ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments