SNP
Sanju Samson, T20 World Cup 2024, IND vs SL: టీమిండియా యువ క్రికెటర్ సంజు శాంసన్ ఇటీవలె లంకపై దారుణంగా విఫలం అయ్యాడు. కానీ, తన కెరీర్ బెస్ట్ అంటే గడిచిన 3 నెలలే అంటున్నాడు. అతను అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Sanju Samson, T20 World Cup 2024, IND vs SL: టీమిండియా యువ క్రికెటర్ సంజు శాంసన్ ఇటీవలె లంకపై దారుణంగా విఫలం అయ్యాడు. కానీ, తన కెరీర్ బెస్ట్ అంటే గడిచిన 3 నెలలే అంటున్నాడు. అతను అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా యువ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గడిచిన మూడు నాలుగు నెలలు తన కెరీర్‌లోనే బెస్ట్ టైమ్ అంటూ పేర్కొన్నాడు. అదేంటి.. ఇటీవలె శ్రీలంకతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు కదా.. ఇప్పుడేంటి అవే బెస్ట్ మూమెంట్స్ అంటున్నాడు అని ఆశ్చర్యపోకండి. సంజు చెప్పింది శ్రీలంకతో సిరీస్ గురించి కాదు.. అంతకంటే ముందు జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 గురించి. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఆ జట్టులో సంజు శాంసన్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం రాకపోయినా.. 15 మంది స్క్వౌడ్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ ఆడి గెలవాలని మూడేళ్ల క్రితమే గట్టిగా అనుకున్నానని, ఆ కల నెరవేరిందంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. అలాగే శ్రీలంకతో సిరీస్‌లో మంచి ప్రదర్శన చేయలేకపోయానని కూడా సంజు ఒప్పుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ప్రకటించిన భారత జట్టులో సంజు శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలెంట్ ఉన్న క్రికెటర్‌కు అవకాశాలు ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో మంచి ప్రదర్శన కనబర్చడం, అలాగే దేశవాళి టోర్నీల్లో కూడా ఆడటంతో సంజు శాంసన్‌ను టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఎంపిక చేశారు. కానీ, ప్లేయింగ్‌లో చోటు దక్కలేదు. ఆ తర్వాత శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. శుబ్‌మన్ గిల్ మెడనొప్పి కారణంగా సంజుకు రెండో టీ20లో అవకాశం వచ్చింది కానీ, గోల్డెన్ డక్‌తో నిరాశపర్చాడు. మూడో మ్యాచ్‌లో కూడా డకౌట్ అయి దారుణంగా విఫలం అయ్యాడు. ఈ బ్యాడ్ ఫామ్ నుంచి సంజు త్వరగా బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి లంకపై ప్రదర్శన కాకుండా.. టీ20 వరల్డ్ కప్‌ను ఉద్దేశిస్తూ.. సంజు శాంసన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sanju Samson said, “the last 3-4 months have been the best of my career. Being part of the World Cup team is like a dream come true something I desired 3-4 years ago. My wish was to play in my last ODI World Cup. I didn’t perform well in the previous series”. (ZEE). pic.twitter.com/PoxFvFEjlZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 10, 2024