iDreamPost
android-app
ios-app

Sanju Samson: ఇది సార్‌.. శాంసన్‌ అంటే! ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు

  • Published Dec 05, 2023 | 6:14 PM Updated Updated Dec 05, 2023 | 6:14 PM

టీమిండియా యువ క్రికెటర్‌ సంజు శాంసన్‌ను అంతా అన్‌ లక్కీ క్రికెటర్‌ అంటుంటారు. అతనిలో బోలెడంత టాలెంట్‌ ఉందని తెలిసినా.. గొప్పగా చెప్పుకునే ఇన్నింగ్స్‌ మాత్రం లేదనే చెప్పాలి. అయితే ఈ ఇన్నింగ్స్‌తో ఆ లోటు తీరిపోయినట్లే అనుకోవాలి. తాజాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన సంతోషంలో సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. అదెక్కడో తెలుసుకుందాం..

టీమిండియా యువ క్రికెటర్‌ సంజు శాంసన్‌ను అంతా అన్‌ లక్కీ క్రికెటర్‌ అంటుంటారు. అతనిలో బోలెడంత టాలెంట్‌ ఉందని తెలిసినా.. గొప్పగా చెప్పుకునే ఇన్నింగ్స్‌ మాత్రం లేదనే చెప్పాలి. అయితే ఈ ఇన్నింగ్స్‌తో ఆ లోటు తీరిపోయినట్లే అనుకోవాలి. తాజాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన సంతోషంలో సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. అదెక్కడో తెలుసుకుందాం..

  • Published Dec 05, 2023 | 6:14 PMUpdated Dec 05, 2023 | 6:14 PM
Sanju Samson: ఇది సార్‌.. శాంసన్‌ అంటే! ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు

టీమిండియా క్రికెటర్‌ సంజు శాంసన్‌ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాను చేసే ప్రదర్శన కంటూ కూడా.. అతనికి అన్యాయం జరిగిందనే విషయంలోనే సంజు పేరు ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో ఉంటుంది. కానీ, అతని టాలెంట్‌పై మాత్రం ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. అద్భుతమైన టాలెంట్‌ ఉన్న యంగ్‌ క్రికెట్‌ అని అందరికీ తెలిసినా.. టీమిండియాలో చోటు సుస్థిరం చేసుకునేంత గొప్ప ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేదు. అందుకే టీమిండియాలో చోటు దక్కే విషయంలో సంజు వెనుకబడుతుంటాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లోనూ సంజుకు టీమిండియాలో చోటు దక్కలేదని చాలా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సైతం సంజును లెక్కలోకి తీసుకోలేదు.

ఇలా అయితే.. టీమిండియాలో తనకు పర్మినెంట్‌గా చోటు దక్కని అనుకున్నాడో ఏమో కానీ, సంజు శాంసన్‌ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. దేశవాళీ క్రికెట్‌లో జరుగుతున్న విజయ్‌ హజరే టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు సంజు శాంసన్‌. మంగళవారం.. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. అది కూడా తన టీమ్‌ 59 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి.. తన టీమ్‌ను నిలబెట్టాడు. మొత్తం 139 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 128 పరుగులు చేసి అదరగొట్టాడు.

కానీ, మిగతా బ్యాటర్లు పెద్దగా సహకరించకపోవడంతో విజయానికి కొద్దిదూరంలో సంజు టీమ్‌ నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రైల్వైస్‌ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. రైల్వైస్‌లో సాహబ్‌ యువరాజ్‌సింగ్‌ 121, ప్రాథమ్‌ సింగ్‌ 61 పరుగులతో రాణించారు. కేరళ బౌలర్లలో వైషాఖ్‌ చంద్రన్‌ 2 వికెట్ల తీసి ఆకట్టుకున్నాడు. ఇక 256 పరుగల భారీ స్కోర్‌ ఛేదించేందుకు బరిలోకి దిగిన కేరళను రైల్వే బౌలర్లు ఆరంభంలోనే దెబ్బ కొట్టారు. వాళ్ల ధాటికి కేరళ కేవలం 59 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ, కెప్టెన్‌ సంజు శాంసన్‌, శ్రేయస్‌ గోపాల్‌(53) రాణించడంతో.. కేరళ జట్టు కోలుకుంది. కానీ, సంజు ఒక్కడే చివరి వరకు పోరాడం, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో కేరళ విజయానికి 18 పరుగుల దూరంలో ఆగిపోయింది. మొత్తం 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసి 18 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.