SNP
Sanju Samson, Ishan Kishan: ఐపీఎల్ 2024లో అద్భుతంగా రాణిస్తున్న సంజు శాంసన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనితో నేను పోల్చుకోను అంటూ స్పష్టం చేశాడు. ఇంతకీ శాంసన్ ఎవరి గురించి అన్నాడో ఇప్పుడు చూద్దాం..
Sanju Samson, Ishan Kishan: ఐపీఎల్ 2024లో అద్భుతంగా రాణిస్తున్న సంజు శాంసన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనితో నేను పోల్చుకోను అంటూ స్పష్టం చేశాడు. ఇంతకీ శాంసన్ ఎవరి గురించి అన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ క్రికెటర్లతో పాటే.. రియాన్ పరాగ్, అశుతోష్ శర్మ లాంటి యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్లు సత్తా చాటి కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏం లేదు. అలాగే ఆన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఈ ఒక్క సీజన్‌లో రాణిస్తే సరిపోదు. కానీ, ఈ ఐపీఎల్ సీజన్ మాత్రం కొంతమంది ఆటగాళ్లకు ఎంతో కీలకం. ఒక రకంగా చెప్పాలంటే.. వాళ్ల భవిష్యత్తుని ఈ సీజన్ నిర్దేశిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. అలాంటి వారిలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరికే ఈ సీజన్ ఎందుకంత ముఖ్యంగా అంటే ఈ ఐపీఎల్ తర్వాత.. జూన్‌లో టీ20 వరల్డ్ కప్ 2024 ఉన్న విషయం తెలిసిందే.
ఈ వరల్డ్ కప్ కోసం టీమిండియాలో చాలా స్పాట్లు ఖాళీగా ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ లాంటి స్టార్ ప్లేయర్లను మినహా ఇస్తే.. మరెవరికీ టీమ్‌లో ప్లేస్‌పై గ్యారెంటీ లేదు. పైగా టీమ్‌లో వికెట్ కీపర్ క్యమ్ బ్యాటర్ చోటు ఎంతో కీలకంగా మారింది. ఈ స్థానం కోసం కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ నీకు పోటీగా భావిస్తున్నావా? అని ఎదురైన ప్రశ్నకు సంజు శాంసన్ తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు. నేను ఇషాన్‌ను ఎంతో గౌరవిస్తాను, అతను అద్భుతమైన ఆటగాడు, గొప్ప కీపర్, మంచి బ్యాటర్, గొప్ప ఫీల్డర్ కూడా. అయితే.. నాకున్న బలం, బలహీనత నాకున్నాయి. అలాంటప్పుడు నేను ఎవరితోనూ పోల్చుకోను. నాతో నేను పోటీపడేందుకు ఇష్టపడతాను. దేశానికి ఆడి గెలవడం కంటే గొప్ప ఏముంటుంది. అయితే.. ఒక టీమ్‌కు ఆడే ప్లేయర్‌తో పోల్చుకోవడం అంత మంచిది కాదు’ అని శాంసన్ పేర్కొన్నాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇషాన్ కిషన్ కంటే సంజు శాంసనే మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాగే కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ కూడా అదరగొడుతూ.. శాంసన్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. మరి వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. కేఎల్ రాహుల్, పంత్, శాంసన్, ఇషాన్.. వీరి నలుగురిలో వికెట్ కీపింగ్ పరంగా అంతా బాగానే చేస్తున్నా.. బ్యాటింగ్‌లో 7 మ్యాచ్‌ల్లో 286 పరుగులతో రాహుల్ ముందున్నాడు. తర్వాత 7 మ్యాచ్‌ల్లో 276 పరుగులతో సంజు శాంసన్ రెండో ప్లేస్‌లో, 8 మ్యాచ్‌ల్లో 254 పరుగులతో పంత్ మూడో స్థానంలో, 7 మ్యాచ్‌ల్లో 192 పరుగులతో ఇషాన్ చివరి స్థానంలో ఉన్నాడు. అయితే.. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా ఆడుతుండగా, సంజు శాంసన్ వన్‌డౌన్‌లో ఆడుతున్నాడు. కానీ, పంత్ మాత్రం లోయర్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. లోయర్ ఆర్డర్‌లో ఆడుతూ కూడా పంత్ అన్ని పరుగులు చేయడం గొప్ప విషయం. మరి ఇషాన్‌తో నేను పోల్చుకోను అని సంజు శాంసన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sanju Samson said “I really respect Ishan, he is a wonderful player, a great keeper, good batter, great fielder as well – I have my own strength & weakness, definitely, I don’t compete with anyone – I just like to compete with myself & playing for the country and winning the… pic.twitter.com/pgGsPQuPyw
— Johns. (@CricCrazyJohns) April 22, 2024