వరల్డ్ కప్ కోసం సంజూ శాంసన్ మాస్టర్ ప్లాన్! నిన్న మ్యాచ్ లో ఈ మార్పు గమనించారా?

Sanju Samson- T20 World Cup 2024: టీమిండియా వచ్చే వరల్డ్ కప్ కోసం కఠోరంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్- బ్యాటర్ సంజూ శాంసన్ ఒక కొత్త మాస్టర్ ప్లాన్ వేసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Sanju Samson- T20 World Cup 2024: టీమిండియా వచ్చే వరల్డ్ కప్ కోసం కఠోరంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్- బ్యాటర్ సంజూ శాంసన్ ఒక కొత్త మాస్టర్ ప్లాన్ వేసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్.. టీమిండియా సహా అన్ని జట్లకు వచ్చే పొట్టి క్రికెట్ మహా సంగ్రామానికి మంచి వేదిక అయ్యింది. టీమిండియా ఆటగాళ్లు సహా అందరు ప్లేయర్లు టీ20 వరల్డ్ కప్ 2024 కోసం తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాల ప్లేయర్స్ సొంత దేశానికి తిరిగి వెళ్లిపోయారు. వరల్డ్ కప్ కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే టీమిండియా మొత్తం ఐపీఎల్ సీజన్ నే ప్రాక్టీస్ సెషన్ గా వాడుకుంటోంది. వరల్డ్ కప్ కి సెలక్ట్ అయి ఆటగాళ్లు ఎక్స్ ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు. వాటిలో భాగంగానే టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఒక కొత్త వ్యూహాన్ని రచిస్తున్నాడు.

సంజూ శాంసన్ కు టీమిండియా ఫ్యాన్స్ లో మంచి ఫాలోయింగ్. సంజూ శాంసన్ కు వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కడంతో అతని ఫ్యాన్స్ మొత్తం తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే సంజూ శాంసన్ కు టీమిండియాలో అవకాశం దక్కిన తర్వాత చాలాసార్లు విఫలం అవ్వడం కూడా చూశాం. కానీ, ఈసారి సంజూ శాంసన్ తన అప్రోచ్ మార్చుకున్నాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం తనని తాను ఘోరంగా శిక్షించుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అందుకోసం ఒక కొత్త వ్యూహాన్ని కూడా రచించుకున్నట్లు కనిపిస్తోంది. ఆ వ్యూహం అంత తేలిక కూడా కాదు. కానీ, కఠోరంగా కృషి చేస్తున్నాడు. ఈసారి వరల్డ్ కప్ లో సంజూ మాస్టర్ ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

అసలు విషయం ఏంటంటే.. ఈసారి వరల్డ్ కప్ వెస్టిండీస్, యునైటెడ్ స్టేస్ ఆఫ్ అమెరికాలో నిర్వహిస్తున్నారు. వెస్టిండీస్ పిచ్ ల గురించి అందరికీ తెలిసిందే. అవి కాస్త స్లోగా ఉంటాయి. బాల్ వేసిన తర్వాత కాస్త నెమ్మదిగా, ఎత్తువ తక్కువగా బ్యాటు మీదకు వస్తుంది. అలాంటి పిచ్ ల మీద నిలకడగా, లాంగ్ ఇన్నింగ్స్ రాబట్టాలి అంటే.. బ్యాక్ ఫుట్ మీదే ఎక్కువ షాట్స్ ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు కొత్తగా బ్యాటింగ్ శైలి మార్చుకోవడం అంత తేలిక కాదు. కానీ, సంజూ శాంసన్ మాత్రం అలాంటి బ్యాక్ ఫుట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేశాడు.

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ మీద జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ స్టాన్స్ గమనించారా? సాధారణం కంటే చాలా వంగి బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్ లో ఎక్కువ బాల్స్ ని బ్యాక్ ఫుట్ మీదే ఆడాడు. గత మ్యాచుల్లో ఎప్పుడూ సంజూ శాంసన్ అంత వంగి బ్యాటింగ్ చేయడం చూడలేదు. వచ్చే వరల్డ్ కప్ కోసం.. మరీ ముఖ్యంగా వెస్టిండీస్ పిచ్ ల మీద స్పిన్ ని ఎదుర్కోవడం కోసం శాంసన్ ఇలాంటి ఘోరమైన ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్ ప్రాక్టీస్, వ్యూహం చూస్తుంటే మాత్రం వచ్చే వరల్డ్ కప్ లో సంజూ తప్పక రాణిస్తాడని అర్థమవుతోంది. మరి.. ఐపీఎల్లో వరల్డ్ కప్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన సంజూ శాంసన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments